ముంపు బాధితులు అధైర్యపడొద్దు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్ ముంపు బాధితులు అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బస్వాపురం రిజర్వాయర్ ముంపునకు గురవుతున్న మండలంలోని లప్పానాయక్‌తండా వాసులు శుక్రవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, జూలై 1 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్ ముంపు బాధితులు అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బస్వాపురం రిజర్వాయర్ ముంపునకు గురవుతున్న మండలంలోని లప్పానాయక్‌తండా వాసులు శుక్రవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని కలిశారు.
దాతరుపల్లి గ్రామం వద్ద పునరావాసం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంపై ప్రభుత్వ విప్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముంపు భాదితులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పునరావాసంపై జాయింట్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. లేఅవుట్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వవిప్ను కలిసిన వారిలో గ్రామ సర్పంచ్ ధీరావత్ బుజ్జీశంకర్నాయక్, బాలు, బీచ్యానాయక్, మోహన్, బలరాం పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

