మాల్, అక్టోబర్ 08 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు మహిళా సంఘాలను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలు, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. చింతపల్లి మండలంలో గురువారం ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా గోడుకొండ్లలో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేశారు. గోడుకొండ్ల గ్రామంలో వి బి జి రామ్ జీ నిధుల నుండి రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వి.టి.నగర్లోనూ మహిళా సమాఖ్య భవనానికి శ్రీకారం అనంతరం అదే గ్రామ పరిధిలోని మహిళా సమాఖ్య సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
గొల్లపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన అనంతరం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో విబీ జీ రామ్ జీ అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ధైర్యపురి తండాలో మహిళా సంఘ భవనంను ప్రారంభించారు. అనంతరం ధైర్యపురి తండాలో వీబీ జి రామ్జీ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే బాలు నాయక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో దొంతం అలివేలు సంజీవరెడ్డి, జాటావత్ హరినాయక్, ముచర్ల గిరి, ఎరుకల వెంకటయ్య గౌడ్, కొండూరు పవన్ కుమార్, కాశగోని వెంకటయ్య, అనంతుల శ్రీను గౌడ్, వాంకుడోత్ అనిత, దాసు, అంగిరేకుల నాగభూషణం, వాంకుడోత్ రవి నాయక్, మాస భాస్కర్, జంగిటి నర్సింహా, యాచారపు యాదిగౌడ, గుండ్లపల్లి నర్సిరెడ్డి, కాయితి జితేందర్ రెడ్డి, దాసరి శ్రీనివాస్ యాదవ్, గుణమోని కొండల్ యాదవ్, మహ్మద్ ఖలీల్, అధికారులు, మార్కెట్ డైరెక్టర్లు, మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.