‘పెన్షన్ వ్యాలిడిషన్ చట్టంతో తీవ్ర నష్టం’
కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని పెన్షనర్ల సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అన్నారు, బుధవారం పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు..
తుంగతుర్తి, మార్చి 25 : కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని పెన్షనర్ల సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అన్నారు, బుధవారం పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు, ఈ పెన్షన్ విధానంతో పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. 1 జనవరి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని, ఆ తర్వాత విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించి వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తుందన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నరు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్ వారి జీవిత భద్రతకు, గౌరవానికి ఆధారంగా ఉంటుందన్నారు. ఇది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదని, ప్రభుత్వ సేవకు అంకితమైన జీవితానికి ప్రత్యేక గుర్తింపు అన్నారు,
పెన్షన్ వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పుల వల్ల పెన్షన్ ఉద్యోగులలో గందరగోళాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు, పెండింగ్ డీఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దార్ దయానదంకు అందజేశారు. ఈ ధర్నాకు మండల విశ్రాంత ఉద్యోగులు తాళ్ల పెళ్లి యాదగిరి, కాసం మల్లయ్య, సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దాసు, ఎండి జాన్, పాలకుర్తి ఎల్లయ్య, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మారెడ్డి, గునిగంటి సోమయ్య, ఉపేందర్, శ్రీరాములు, మాధవరావు, పులుసు పుల్లయ్య, పురుషోత్తం, మౌలానా, లలిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య, రమేష్ గౌడ్ సంఘీభావం తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

