Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
నల్లగొండ రూరల్, అక్టోబర్ 13: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ నల్లగొండ జిల్లా కమిటీ కోరింది.
నల్లగొండ రూరల్, అక్టోబర్ 13: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ నల్లగొండ జిల్లా కమిటీ కోరింది. ఇళ్ల కేటాయింపులో అర్హులైన పేదలకు న్యాయం చేయాలని సర్పంచ్ల సంఘం జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు మేకల పల్లవి అరవింద్ రెడ్డి నేతృత్వంలో కలెక్టర్ చంద్రశేఖర్ బడుగుకు సర్పంచ్‌లు వినతిపత్రం అందజేశారు.
కలెక్టర్ చంద్రశేఖర్ బడుగుకు వినతిపత్రం అందజేసిన సందర్భంగా సర్పంచ్ల సంఘం జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు మేకల పల్లవి అరవింద్ రెడ్డి మాట్లాడారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల అమలులో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని అరవింద్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గ్రామాలలో త్రాగునీటి , విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో జిల్లపల్లి రేణుక రాజు, తగుళ్ల శ్రీను, షేక్ కమాల్, పెరిల్ల లింగయ్య, మల్లెబోయిన బుచ్చిరాజు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

