శాలిగౌరారం, అక్టోబర్ 17 : తెలంగాణ ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మంగళవారం శాలిగౌరారంలో మండల కబడ్డీ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సతీమణి కమలతో కలిసి బతుకమ్మల చుట్టూ ఆట ఆడి పాడారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరు కాగా బతుకమ్మ పాటలతో సందడి నెలకొన్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ తెలంగాణ సంసృతీ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.
అనంతరం బతుకమ్మలను మంచిగా పేర్చిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కందుల అనిత, ఏఎంసీ చైర్మన్ మామిడి తేజస్వి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, చాడ హతీశ్రెడ్డి, గుండా శ్రీనివాస్, తాళ్లూరి మురళి, మామిడి సర్వయ్య, నూక సత్తయ్యయాదవ్, కిరణ్‌కుమార్‌యాదవ్, మాజీ జడ్పీటీసీ అయితగోని సునీత, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు కల్లూరి నాగరాజుగౌడ్, జెర్రిపోతుల మంజుల, గుజిలాల్ శేఖర్‌బాబు, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, కంబాలపెల్లి కృష్ణ, శానాల యుగేంధర్‌రెడ్డి, గంట శంకర్, బట్ట వీరబాబు, చిరబోయిన శ్రీనివాస్, చివుట సైదులు పాల్గొన్నారు.