ఆర్టీసీ కార్గోలో హమాలీల ఆక్రందన..!
నష్టాలో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ సర్కార్ ఆర్టీసీలో కార్గో సేవలను ప్రవేశపెట్టింది. దాంతో బస్సుల్లో వచ్చే సామగ్రిని దించి ఎత్తేందుకు హమాలీలు పని చేసేవారు.
- హమాలీ చార్జీ పార్సిల్‌కు రూ.10నుంచి రూ.5 తగ్గించిన ఆర్టీసీ
- వినియోగదారుడి నుంచి మాత్రం పార్సిల్ రేటు పెంపు
- కూలి గిట్టడం లేదని వాపోతున్న హమాలీలు
- నిత్యావసర ధరల పెంపునకు అనుగుణంగా పెంచాలని వేడుకోలు
నల్లగొండ సిటీ, డిసెంబర్ 22 : నష్టాలో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ సర్కార్ ఆర్టీసీలో కార్గో సేవలను ప్రవేశపెట్టింది. దాంతో బస్సుల్లో వచ్చే సామగ్రిని దించి ఎత్తేందుకు హమాలీలు పని చేసేవారు. గతంలో వారికి పార్సిల్‌ను బట్టి రూ.10 రూపాయలు ఇచ్చేవారు. తాజాగా పార్సిల్ చార్జీలను పెంచిన ఆర్టీసీ యజమాన్యం హమాలీ చార్టీలను మాత్రం తగ్గించింది. దాంతో హమాలీలకు కూలి గిట్టక పూట గడవడం కష్టంగా మారింది. గత 30 సంవత్సరాలకు పైగానే నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌లో పార్సిళ్ల ఎగుమతి, దిగుమతి చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. గతంలో ఏఎన్ఎల్ పేరున ఉన్న పార్సిల్ సెంటర్స్ ప్రస్తుతం కార్గో పేరున సరుకుల రవాణా జరిగే సందర్భంలో ఎగుమతి, దిగుమతి చేస్తున్న హమాలీలకు సరైన చార్జీలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అనుసరించి హమాలీల రేట్లు పెంచాల్సిన ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం తగ్గించడంతో రోజువారీ కూలి గిట్టడం లేదని వాపోతున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పార్సిల్ చార్జీలు పెంచాలని కోరుతున్నారు.
పార్సిల్ రేట్లు పెంపు..
ఆర్టీసీ సంస్థ శుక్రవారం నుంచి సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేసి పార్సిల్స్ రేట్లను పెంచింది. కానీ, హమాలీ రేటు మాత్రం గతంలో రూ.10 రూపాయలు ఉండగా దానిని 5 రూపాయలకు తగ్గించి హమాలీల పొట్ట కొట్టింది. దాంతో రోజువారీ కూలి గిట్టడం లేదని కార్మికులు వాపోతున్నారు. తాజాగా పార్సిల్ రేట్లు పెంచిన ఆర్టీసీ ఇప్పటి వరకు కవర్ చార్జి రూ.55 ఉండగా దాన్ని రూ.60కి, 25 కేజీల బరువు గల లగేజీ చార్జీని రూ.85 నుంచి 90 రూపాలయకు పెంచింది.
రేట్లు తగ్గించి మా పొట్ట కొట్టారు
గతంలో ఒక పార్సిల్‌పై కనీసం 10 రూపాయలు ఉండేది. ఆ పైన బరువును బట్టి చార్జీలు పెరుగుతుండేవి. ఇప్పుడు ఉన్న దానిని 5 రూపాయలకు తగ్గించి ఆర్టీసీ యాజమాన్యం మా పొట్ట కొట్టింది. ఇది ఏమాత్రం సరైనది కాదు. ఆర్టీసీ సంస్థ పునరాలోచన చేసి పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు పెంచాలి.
-అంజి, హమాలీ, నల్లగొండ
రోజుకు రూ.100 కూడా రావు
నేను 30 సంవత్సరాలుగా ఆర్టీసీలో హమాలీ పని చేస్తున్నా. ఏఎన్ఎం ఉన్నప్పుడు కూడా కనీస చార్జి రూ.10 రూపాయలు చెల్లించేది. దాని స్థానంలో గత నాలుగు సంవత్సరాల క్రితం కార్గోను తీసుకొచ్చారు. అయినా కనీస చార్జి 10 రూపాయలు, ఆ పైన బరువును బట్టి చార్జీలు చెల్లించేవారు. తాజాగా కార్గో పార్సిల్ రేట్లను పెంచిన అధికారులు హమాలీ చార్జీలు మాత్రం తగ్గించారు. దాంతో మాకు రోజుకు వంద రూపాయలు కూడా గిట్టడం లేదు.
-నర్సింహ, హమాలీ, నల్లగొండ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

