ఆర్థిక ప్రగతి.. తలసరి వృద్ధి
సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుతనానికి నిదర్శనం ఉమ్మడి నల్లగొండ జిల్లా. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లాగా పేరున్నా అభివృద్ధికి ఆమడ దూరమన్నది కాదనలేని సత్యం.
- ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆదాయం
- రాష్ట్రంలోనే ఆరో స్థానంలో యాదాద్రి జిల్లా
- 10, 12 స్థానాల్లో నల్లగొండ, సూర్యాపేట
- టీఎస్‌డీపీఎస్ 2020-21 నివేదికలో వెల్లడి
- గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
- వేగంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి
- స్వరాష్ట్రంలో ప్రగతిపథంలో జిల్లా
సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుతనానికి నిదర్శనం ఉమ్మడి నల్లగొండ జిల్లా. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లాగా పేరున్నా అభివృద్ధికి ఆమడ దూరమన్నది కాదనలేని సత్యం. తాగేందుకు గుక్కెడు తాగునీటికి కూడా కటకటనే. ఫ్లోరైడ్ భూతమే అందుకు నిదర్శనం. సాగునీరు లేక ప్రాజెక్టులు పూర్తికాక వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. మౌలిక వసతుల లేమితో పారిశ్రామిక వృద్ధి అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నేతృత్వంలో ప్రజల పోరాటంతో ఏర్పాటైన స్వరాష్ట్రంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అభివృద్ధి బాట పట్టింది ఉమ్మడి నల్లగొండ జిల్లా.
వ్యవసాయరంగం గణనీయంగా అభివృద్ధి చెందగా నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమ రంగం కూడా ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నది. ఫలితంగా ఆరేడేండ్లల్లోనే ఎంతో వృద్ధి సాధించింది. తలసరి ఆదాయంలో యాదాద్రిభువనగిరి జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో, నల్లగొండ జిల్లా 10వ, సూర్యాపేట జిల్లా 12వ స్థానంలో నిలిచాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం(టీఎస్‌డీపీఎస్) విడుదల చేసిన 2020-21వ సంవత్సరం నివేదికలో వృద్ధి రేటు వెల్లడైంది.
– నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ)

ఆరో స్థానంలో యాదాద్రి జిల్లారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లాలోనూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం లాంటి కీలకమైన రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, రుణమాఫీ, రూపాయికి కిలో బియ్యం, దళితబంధు ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న పథకాలు కూడా ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా తలసరి ఆదాయ వృద్ధి బాగా పెరిగింది.
ఉమ్మడి జిల్లాను పరిశీలిస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో తలసరి ఆదాయం రూ.2.22లక్షలకు పెరిగింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, మహబూబ్‌నగర్ తర్వాత ఆరో స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా నిలిచింది. యాదాద్రి జిల్లాలో వ్యవసాయం గణనీయంగా పెరుగడంతోపాటు పారిశ్రామిక వృద్ధి బాగా జరిగింది. గోదావరి, మూసీ జలాలతో పాటు సాగునీటి వనరులను పటిష్టపర్చడంతో పంటల సాగు భారీగా పెరిగింది.
పారిశ్రామికంగానూ అనేక పరిశ్రమలు వచ్చాయి. ముఖ్యంగా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పారిశ్రామికంగా మంచి టర్నింగ్ పాయింట్‌గా మారింది. దాంతో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా మెరుగుపడడంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రజల ఆదాయంలోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌కు అనుకుని ఉండడం కూడా ఆదాయ వనరులు పెరుగడానికి తోడ్పడింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయం, పారిశ్రామికంగా జరిగిన అభివృద్ధితో యాదాద్రి జిల్లా జీఎస్డీపీలో రాష్టంలోనే ఆరో స్థానంలో నిలువడం విశేషం.

10, 12 స్థానాల్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు
రాష్ట్రంలోని 33 జిల్లాల వారీగా టీఎస్‌డీపీఎస్ విడుదల చేసిన నివేదికలో నల్లగొండ జిల్లా 10వ స్థానంలో, సూర్యాపేట 12వ స్థానంలో నిలిచాయి. రెండు జిల్లాల్లోనూ వ్యవసాయ రంగ అభివృద్ధి ఆధారంగానే ఆదాయ వృద్ధి జరిగినట్లు స్పష్టమైంది. గతంలో సాగునీటి సౌకర్యం లేకపోవడంతో వచ్చిరాని కరెంటు, కరువు కాటకాలతో వ్యవసాయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. సాగర్ ఆయకట్టు మినహాయిస్తే ఎక్కడ చూసినీ బీడు భూములే దర్శనమిచ్చేవి. స్వరాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో ఊహించని విధంగా సాగు విస్తీర్ణం పెరిగింది.
ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే 2014లో 13లక్షల సాగుభూమి ఉంటే ప్రస్తుతం 21లక్షల ఎకరాలకు పైచిలుకు పెరిగింది. ఎనిమిదేండ్లలో ఎనిమిది లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు సాగవుతుండడం విశేషం. ఓ వైపు కృష్ణాజలాలతో సాగర్ ఆయకట్టు, మరోవైపు గోదావరి జలాలతో ఎస్సారెస్పీ ఆయకట్టు పూర్తిగా సాగులోకి వచ్చింది. కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా వరి సాగు జిల్లాగా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి జిల్లాలో గత ఏడాది వానకాలం, యాసంగి సీజన్లు కలిపి మొత్తం వరి పంట 21.38లక్షల ఎకరాల్లో సాగైంది. 49లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. ఉచిత నిరంతర విద్యుత్, సాగునీటి సౌకర్యం, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కేలా చేశాయి. దాంతో వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి సంఖ్య భారీగా పెరగ్గా.. అంతే స్థాయిలో వారి వ్యక్తిగత
ఆదాయంలోనూ వృద్ధి కనిపిస్తున్నది. ఇక పరిశ్రమల పరంగా జిల్లాలో విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో పారిశ్రామిక వృద్ధి కూడా భారీగా పెరుగుతున్నది. వీటి ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఫలితంగా ప్రజల ఆదాయంలోనూ మార్పు కనిపిస్తున్నది. జిల్లాలో ఓ వైపు వ్యవసాయం, మరోవైపు పారిశ్రామిక వృద్ధి పెరుగడంతో పాటు సర్వీసు సెక్టార్ కూడా ఓ మాదిరి పాత్ర చూపిస్తున్నది. దాంతో తలసరి ఆదాయ వృద్ధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
Peace Talks | రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు? త్రైపాక్షిక శాంతి చర్చలకు పుతిన్ అంగీకారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

