న్యూ ఇయర్ వేడుకల్లో హద్దు దాటొద్దు
నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకొనేలా పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ పేరుతో ఫుల్‌గా మందు తాగి వాహనంపై దూసుకెళ్తామనుకునే వారికి పోలీసులు ముందుగానే బ్రేకులు వేయనున్నారు. గతంలో అమలు చేసిన విధంగానే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయునున్నారు
- తాగి నడిపితే తప్పదు భారీ మూల్యం
- నేటి రాత్రి నుంచి డ్రంకెన్ డ్రైవ్
- డీజేలు, గుంపులుగా తిరుగడం నిషేధం
నేరేడుచర్ల, డిసెంబర్ 30 : నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకొనేలా పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ పేరుతో ఫుల్‌గా మందు తాగి వాహనంపై దూసుకెళ్తామనుకునే వారికి పోలీసులు ముందుగానే బ్రేకులు వేయనున్నారు. గతంలో అమలు చేసిన విధంగానే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయునున్నారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మైనర్లు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తారు.
- అధిక వేగంతో వాహనాలు నడుపొద్దు.
- మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదవుతాయి.
- గుంపులుగా గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ, అధిక శబ్ధాలు చేస్తూ తిరుగడం, ర్యాలీగా వెళ్లడం నిషేధం.
- రోడ్లపై పటాకులు కాల్చితే, ఎక్కువ సౌండ్‌తో మైకులు, డీజేలు వినియోగిస్తే కేసులు నమోదు చేస్తారు. ఇండ్లు, ప్రైవేట్ ఆస్తులపై, వీధి దీపాలపై రాళ్లు వేయడం, అద్దాలు పగులగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టడం, వారి పట్ల అసభ్యంగా ప్రవరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.
- ట్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లు తీసివేసి వాహనాలు నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వాహనాలను సీజ్ చేస్తారు.
- బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
కొత్త సంవత్సరంలో విద్యార్థులకు తోడ్పాటు అందించాలి
యాదాద్రి భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి
భువనగిరి కలెక్టరేట్ : కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు, ఇతరులు విద్యార్థులకు తోడ్పాటునందించే వస్తువులను అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో కోరారు. స్వీట్లు, పూల బొకేలు కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, స్టేషనరీ, హాస్టల్ విద్యార్థుల కోసం బెడ్ షీట్స్, టవల్స్ అందించాలని సూచించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

