లాక్డౌన్ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలి : ఐజీ స్టీఫెన్ రవీంద్ర

నల్లగొండ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలని వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఆయన ఎస్పీ ఏవీ రంగనాథ్‌తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా గడియారం సెంటర్, ప్రకాశంబజార్, డీఈవో కార్యాలయం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలను పర్యవేక్షించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐజీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ప్రజలు లాక్డౌన్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులకు సహకరించి కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావాలని ఇంటి వద్దే ఉంటూ అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దన్నారు. పోలీసులు రోడ్లపై ఉండి విధులు నిర్వహించేది ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఎంతోమంది కరోనా బారిన పడి మృతిచెందడంతో పాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతో కరోనాను నిర్మూలించేందుకు కృషి చేయాలని సూచించారు.
లాక్డౌన్ మినహాయింపు సమయంలో కూడా గుంపులుగా గుమికూడకుండా భౌతికదూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐలు సురేష్ కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, దుబ్బ అనిల్, పసుపులేటి నాగ దుర్గాప్రసాద్, నల్లగొండ టూటౌన్ ఎస్ఐ దోరెపల్లి నరసింహులు, రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

