Kattangur : చోరీ కేసులో పార్థీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరికి 18 నెలల జైలు
దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.
కట్టంగూర్, సెప్టెంబర్ 11 : దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి బెల్లి నర్సింహ్మ 2024 జూన్ 15వ తేదీ రాత్రి ఇంటిపైన నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి బంగారు, వెండి వస్తువులను అపహరించుకు పోయారు. దీంతో బాధితుడు నర్సింహ్మ 2024 జూన్ 16న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ నన్నెపంగ శ్రీను కేసు నమోదు చేశాడు.
చిట్యాల సీఐ నాగరాజు విచారణ చేపట్టి పార్దీ గ్యాంగ్ కు చెందిన అప్పపాండు రంగా పవార్, శుభమన్ అశోక్ పవార్ ను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. పూర్తి సమాచారాన్ని కోర్టులో ఫైల్ చేశాడు. దీనిపై నకిరేకల్ మున్సిఫ్ కోర్టులో వాదనలు ముగియగా నేరస్థులకు తేలిన ఇద్దరికి 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి షేక్ ఆరీఫ్ తీర్పు వెలువరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

