ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నెహ్రూ గంజ్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారులు శుక్రవారం రైడ్ చేశారు. సుమారు 5 కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని రూ.5,000 జరిమానా విధించారు. అలాగే రిలయన్స్ దుకాణం ఎదుట...
– నల్లగొండ నెహ్రూ గంజ్‌లో పలు దుకాణదారులకు జరిమానా
నీలగిరి, అక్టోబర్ 09 : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నెహ్రూ గంజ్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారులు శుక్రవారం రైడ్ చేశారు. సుమారు 5 కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని రూ.5,000 జరిమానా విధించారు. అలాగే రిలయన్స్ దుకాణం ఎదుట నిర్మాణ సామగ్రిని నిల్వ ఉంచినందుకు సంబంధిత యాజమాన్యానికి రూ.2,000 జరిమానా విధించారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగించరాదని, దుకాణాల ఎదుట నిర్మాణ సామగ్రిని ఉంచి ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించరాదని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
పర్యావరణ పరిరక్షణ, పట్టణ పరిశుభ్రత కోసం ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండి, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులను వినియోగించాలని మున్సిపల్ అధికారులు పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన నల్లగొండ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ జి.శ్రీనివాస్, వార్డు అధికారులు, పారిశుధ్య కార్మికులు, శానిటేషన్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

