స్వరాష్ట్రంలో పుంజుకున్న ఆటో మొబైల్ రంగం
ఎనిమిదేండ్లలో రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఎదిగింది. ఆర్థిక వనరులకు తెలంగాణనిలయంగా మారింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ప్రతి వ్యక్తికి అవసరమైన వాహనం కొంటున్నారు. దాంతో ఆటోమొబైల్రంగం పుంజుకున్నది. సాగు విస్తీర్ణం పెరుగడంతో ట్రాక్టర్ల కొనుగోళ్లూ ఎక్కువయ్యాయి. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే అన్ని కంపెనీల వాహనాలతో ఆటో షో నిర్వహించడం సంతోషకరం.
-గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి చైర్మన్
ఉమ్మడి జిల్లా చరిత్రలోనే నల్లగొండలో తొలిసారిగా నిర్వహించిన ఆటో షోకు అద్భుతమైన స్పందన
లభించింది. నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో రెండ్రోజులపాటు నిర్వహించిన వాహనాల ప్రదర్శన సూపర్ సక్సెస్ అయ్యింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి
8 గంటల వరకూ వచ్చిపోయే సందర్శకులు, వాహన కొనుగోళ్లతో ఆటోషో ఆసాంతం సందడిగా
సాగింది. ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 19 ఆటోమొబైల్ కంపెనీలు ఏర్పాటుచేసిన స్టాళ్లలో కార్లు, బైక్‌లు, ట్రాక్టర్లను చూసి నచ్చిన వాటిని కొనుగోలు చేశారు.
ఎస్బీఐ, డీసీసీబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం కల్పించాయి. రాత్రి అట్టహాసంగా సాగిన ముగింపు కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అన్ని స్టాళ్లను సందర్శించారు. వాహనాలు కొనుగోలు చేసిన వారికి తాళంచెవి అందించి శుభాకాంక్షలు చెప్పారు. సందర్శకుల మెగా డ్రాలో విజేతగా నిలిచిన నార్కట్‌పల్లికి చెందిన యువకుడు రాకేశ్‌కు నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే తరఫున స్మార్ట్ ఫోన్‌ను అందజేశారు. ఇప్పటివరకూ మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఆటో షోను నల్లగొండలో నిర్వహించడంపై సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు.
– నల్లగొండ, డిసెంబర్ 11
ఆటోషోలో ప్రత్యేక ఆఫర్ ఇవ్వడం సంతోషకరం
మేం కారు తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. నల్లగొండలో వేర్వేరు చోట్ల ఆయా కంపెనీల షోరూమ్‌లు ఉండడంతో వివరాలు తెలుసుకునేందుకు టైమ్ లేక వాయిదా వేసుకుంటూ వచ్చాం. నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షోలో అన్ని కంపెనీల కార్లు ఉన్నాయని తెలుసుకొని వచ్చాం. పవన్ మోటర్స్ స్టాల్లో బాలెనో కారు బుక్ చేసుకున్నాం. ఆటో షోలో మంచి ఆఫర్ ఇవ్వడంతో వెంటనే డబ్బు చెల్లించి బుక్ చేశా. నల్లగొండలో ఆటో షో ఏర్పాటు చేయడం కొనుగోలుదారులకు
మంచి అవకాశం.
– వంగూరి వెంకట్, విద్యుత్ ఉద్యోగి, నల్లగొండ
ప్రత్యేక డిస్కౌంట్లు..
రెండ్రోజుల ఆటో షోలో 19 కంపెనీలకు సంబంధించిన టూ వీలర్స్, కార్లు, ట్రాక్టర్లు, వాటికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ అందుబాటులో ఉంచారు. ఉదయం 11 నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఆయా కంపెనీలు కొనుగోలుదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇచ్చాయి. బైక్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు, కార్లకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు తగ్గింపు ఇవ్వడంతో పాటు వాహనాల్లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసి అందజేశారు. ఎక్స్ఛేంజ్ చేసిన కార్లలో పెట్రోల్ వర్షన్ అయితే రూ.30వేల నుంచి రూ.40వేల వరకు డిస్కౌంట్ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నల్లగొండలోని నాగార్జున కళాశాలలో నిర్వహించిన ఆటో షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండో రోజు ఆదివారం తొలి రోజుకు మించిన స్పందన లభించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు ఇలాంటి షోలు నిర్వహించకపోవడంతో తొలి రోజే అనూహ్య స్పందన లభించగా.. రెండో రోజు అంతకు మించిన స్పందన వచ్చింది. రెండో రోజూ 19 కంపెనీలకు సంబంధించిన బైక్‌లు, కార్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచగా.. బయ్యర్లు, విజిటర్లు పెద్ద సంఖ్యలో సందర్శించారు.
వాహనాలు బుకింగ్ చేసుకున్న కొనుగోలుదారులకు ఆయా కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్లు ఇచ్చాయి. ఉదయం పది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ షో కొనసాగింది. వాహనాలు కొన్న బయ్యర్లకు అక్కడే అందుబాటులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం కల్పించాయి. ముగింపు కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరై పలువురు బయ్యర్లు, లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేశారు. ఇద్దరు విజిటర్స్, ఒక డీలర్‌కు లక్కీ డిప్ ద్వారా కేఫ్ నిలోఫర్ సహకారంతో బహుమతులు అందజేయగా.. చివరి రోజు విజిటర్స్, బయ్యర్స్‌తో కలిపి బంపర్ డ్రా కింద స్మార్ట్ ఫోన్ అందజేశారు. రెండ్రోజుల్లో మొత్తంగా 12 కార్లు, 11 బైక్‌లు అమ్ముడయ్యాయి.
– నల్లగొండ, డిసెంబర్ 11
నేను ఎజ్డీ బైక్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాలలో ఆటో షో పెట్టడంతో డిస్కౌంట్ వస్తుందని ఇక్కడికి వచ్చాను. ఎజ్డీ 350 సీసీ బైక్‌ను రూ.2.58లక్షలకు కొనుగోలు చేశాను. ఇలాంటి ఆటో షోలు నిర్వహించడం చాలా బాగుంది. వీటి వల్ల అన్ని కంపెనీల బైక్‌ల ధర ఎంత ఉన్నది.. సీసీ ఎంత.. మైలేజ్ ఎంత వస్తుంది? అనే విషయాలు పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. దాంతో బైక్‌లపై అవగాహన వస్తుంది.
– సాయినాథ్, నల్లగొండ
సిరిపురం నుంచి వచ్చి కారు తీసుకున్నా
నల్లగొండ ఎన్జీ కళాశాల గ్రౌండ్లో ఆటో షో నిర్వహిస్తున్నారని నమస్తే తెలంగాణ పేపర్లో చూసి వచ్చా. ఇక్కడ ప్రదర్శనలో ఉంచిన పలు రకాల కార్లను పరిశీలించా. పవన్ మోటార్స్ స్టాల్ వద్ద వ్యాగనార్ వీఎక్స్ఐ కారు బుకింగ్ చేసుకున్నాం. ప్రత్యేక ఆఫర్లో కొంత తగ్గించారు. ఈ అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యానికి ధన్యవాదాలు.
– పబ్బు వెంకటేశం, సిరిపురం, రామన్నపేట మండలం. యాదాద్రి జిల్లా
పాత కారు ఎక్స్ఛేంజ్ చేసి కొత్తది తీసుకున్నా
మాకు ఇంతకు ముందు ఐ-20 కారు ఉండగా, దాన్ని ఎక్స్ఛేంజ్ చేసి కొత్తది తీసుకోవాలనుకున్నాం. నమస్తే తెలంగాణ ఆటో షో నిర్వహిస్తుందని తెలుసుకొని ఇక్కడికి వచ్చా. పాత కారును ఎక్స్ఛేంజ్ చేసి దాని స్థానంలో కియా సెల్టాస్ కారు తీసుకున్నా. ఇది ఆన్ రోడ్ వచ్చేసి రూ.18లక్షలు పడింది. పెట్రోల్ వర్షన్ కావడంతో రూ.30వేల నుంచి రూ.40వేల వరకు డిస్కౌంట్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ ఆటో షో చాలా వరకు అవగాహన కలిగిస్తుంది.
– రోహిన్, ఏపీజీవీబీ మేనేజర్, నల్లగొండ
ఆటో షోతో మంచి ఫలితం
నల్లగొండ పట్టణానికి కొంత దూరంలో ఉన్న మా షోరూమ్‌కు రావడానికి కొంత మంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్జీ కళాశాల గ్రౌండ్లో నమస్తే తెలంగాణ నిర్వహించిన ఆటో షోలో మా స్టాల్‌ను చాలా మంది సందర్శించారు. దాదాపుగా 40 ఎంక్వైరీస్ వచ్చాయి. నలుగురు కస్టమర్లు మా కార్ల ఫీచర్స్ చూసి బుకింగ్ చేసుకున్నారు. మిగిలిన కంపెనీల కార్లు కూడా ఇక్కడే ఉండడంతో వాటికి, మా కార్లకు మధ్య వ్యత్యాసాలు తెలుసుకుని ఆసక్తిగా ఎంక్వైరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. కస్టమర్ల శ్రేయస్సు, మంచి సర్వీస్ ఇస్తూ సేవలందిస్తుండడంతో మా కార్ల గిరాకీ బాగానే సాగుతుంది. ఆటో షోలో పాల్గొనడంతో మంచి ఫలితం వచ్చింది.
– జి.రవికుమార్, పవన్ మోటర్స్ టీం లీడర్, నల్లగొండ
మంచి ఆఫర్ ఇవ్వడంతో యాక్టివా తీసుకున్నా
స్కూటీ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఆటో షో నిర్వహిస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చా. కుశాల్ హోండా స్టాల్ వద్ద యాక్టివా తీసుకున్నా. ప్రత్యేక ఆఫర్లో రూ.1.9లక్షలకు ఇచ్చారు. ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు.
– అంబటి ముత్యాలు, నల్లగొండ
వాహనాలు తీసుకునేవారికి ఆటో షో చక్కటి వేదిక
కస్టమర్లు వివిధ షోరూమ్‌లకు వెళ్లి వాహనాల గురించి తెలుసుకోవాలంటే కొంత కష్టమే. ఆటో షో ద్వారా అన్ని షోరూమ్‌లను ఒకే చోటకు చేర్చడం పట్టణ వాసులకు గొప్ప వరం. ఇక్కడ అన్ని రకాల కంపెనీల టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నాయి. కాబట్టి అన్నింటినీ పరిశీలించి నచ్చింది తీసుకునే మంచి అవకాశం కల్పించారు. ఇక్కడ ఆఫర్లు ఇవ్వడంతో మా కంపెనీ వాహనాలను పలువురు కస్టమర్లు బుకింగ్ చేసుకున్నారు.
– గట్టు వెంకన్న, హీరో వెంకటరమణ మోటర్స్ యజమాని, నల్లగొండ
సులభంగా రుణం గోందే అవకాశం
ఒకే వేదికపై బ్యాంకులు ఆటోమొబైల్స్‌ను వీక్షించి కొనుగోళ్లు చేసే అవకాశం కల్పించడం శుభపరిణామం. వాహన కొనుగోలుదారులకు సులభంగా లోన్ అందించే అవకాశం కలిగింది. ఇది కేవలం ఆటో షో ద్వారానే కస్టమర్లకు దొరుకుతుంది. ఒక్క రోజులోనే అతి తక్కువ వడ్డీతో లోన్ అందించే సంస్థ ఎస్బీఐ. ఇంత చక్కటి అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యానికి ధన్యవాదాలు.
నల్లగొండలో తొలిసారి కున్ బీవైడీ కార్ల ప్రదర్శన
కున్ బీవైడీ కార్లను ఎక్కువగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో నిర్వహించే ఆటో షోల్లో ప్రదర్శిస్తుంటాం. నల్లగొండలో తొలిసారి మా కార్లను ప్రదర్శనకు ఉంచాం. చాలా మంది స్టాల్ వద్దకు వచ్చి కార్ల ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. త్వరలోనే వచ్చి తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణ
– ఎ.సుధాకర్, కున్ బీవైడీ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్, హైదరాబాద్
చక్కటి స్పందన లభించింది
ఆటో షోలో హోండా బైక్‌లు, యాక్టివా, ఇతర మోడల్స్ అందుబాటులో ఉంచాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించింది. రెండ్రోజుల్లో ఆరు బైక్‌లు, రెండు యాక్టివాలు అమ్ముడు పోయాయి. 35కు పైగా కస్టమర్లు పలు మోడల్స్ బైక్‌ల వివరాలు తెలుసుకున్నారు. కొందరు బుకింగ్ చేసుకున్నారు. మరికొందరు త్వరలో తీసుకుంటామని చెప్పారు. అన్ని రకాల వాహనాలపై ప్రత్యేక ఆఫర్స్, గిఫ్ట్‌లు అందజేశాం.
– పి.సురేశ్, విఘ్నేశ్వర హోండా షోరూం సేల్స్ మేనేజర్, నల్లగొండ
మోరీస్ గ్యారేజెస్ కార్ల గురించి చాలా మంది ఎంక్వైరీ చేశారు
మోరీస్ గ్యారేజెస్ కార్ల షోరూమ్‌లు హైదరాబాద్‌లోని బంజరాహిల్స్, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నాయి. మా కంపెనీ కార్లు దాదాపు అన్ని ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. అయితే.. వాటి గురించి నల్లగొండలో చాలా మందికి తెలియదు. ఈ షోలో మా కార్లను చూసి ఎంక్వైరీస్ చేశారు. కొంత మంది బుకింగ్ చేసుకుంటామని చెప్పారు. ఇంత మంచి అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది.
– పి.వీరేంద్ర, సేల్స్ మేనేజర్, హైదరాబాద్
సందర్శకుల నుంచివిశేష స్పందన
ఆటో షోకు తొలి రోజుకు మించిన స్పందన లభించింది. షోపై పెద్ద ఎత్తున ప్రచారం కావడం, మొదటి రోజు బైక్‌లు, కార్లు కొనుగోలు చేసిన వారికి ఊహించని డిస్కౌంట్ ఇవ్వడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా కంపెనీల స్టాల్స్‌ను సందర్శించిన కొంత మంది వాహనాలు కొనుగోలు చేయగా.. మరికొంత మంది ధరల వివరాలు, ఫీచర్స్ గురించి తెలుసుకున్నారు. కొందరు పాత బైకులు, కార్లు ఎక్స్ఛేంజ్ చేసి కొత్త వాహనాలు తీసుకున్నారు.
రైతులకు వీవీసీ ట్రాక్టర్స్ ప్రత్యేకతలు తెలియజేశాం
మార్కెట్లో చాలా కంపెనీల ట్రాక్టర్లు ఉన్నాయి. మా వీవీసీ ట్రాక్టర్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా వ్యవసాయంలో ఉపయోగించే పలు రకాల పరికరాలు (ఇంప్లిమెంట్స్) సైతం అందుబాటులో ఉంచాం. దాంతో ఆటో షోకు వచ్చిన వారు స్టాల్ వద్దకు వచ్చి తిలకించి మా ట్రాక్టర్స్ ఫీచర్స్, పరికరాల గురించి శ్రద్ధతో తెలుసుకున్నారు. ఇలా అవకాశం కల్పించి మా ట్రాక్టర్స్ విశిష్టతను ప్రజలకు, రైతులకు తెలిపే అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– వి.మాధవరెడ్డి, వీవీసీ ట్రాక్టర్ షోరూం మేనేజర్, నల్లగొండ
షోలో తొలి బైక్ కొనుగోలు మా వద్దే..
ఆటో షోలో మాకు అవకాశం కల్పించడం
సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రదర్శించిన స్టాల్స్‌ను తిలకించిన కస్టమర్లు మొదటగా యాక్టివాను మా వద్దే కొనుగోలు చేశారు. ఇందుకు గర్వంగా ఉంది. కస్టమర్స్, ప్రజల నుంచి రెస్పాన్స్ బాగా లభించింది. కొంత మంది బుకింగ్ చేసుకున్నారు. మరికొంత మంది ఎంక్వైరీస్ చేసి షోరూం వద్దకు వస్తామని చెప్పారు. ఒకే వేదికపై ఇలాంటి అవకాశాలు కల్పించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు కృతజ్ఞతలు. ఇలాంటి వేదికలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– ఎం.ఫణికుమార్, కుశాల్ హోండా జనరల్ మేనేజర్, నల్లగొండ