కార్టూన్లకు కేరాఫ్‌గా శిరంశెట్టి ఆనంద్
ఆయన కుంచె పట్టి కార్టూన్ వేస్తే చూసేవారికి అదరహో అనిపిస్తుంది. బొమ్మ గీశాడంటే మన్ననలు పొందాల్సిందే.
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతున్న చిత్రాలు
- ఉద్యమం, చిన్నారుల గీతలు, బతుకమ్మ కార్టూన్ పుస్తకాల ఆవిష్కరణ
బొడ్రాయిబజార్, డిసెంబర్ 16 ;ఆయన కుంచె పట్టి కార్టూన్ వేస్తే చూసేవారికి అదరహో అనిపిస్తుంది. బొమ్మ గీశాడంటే మన్ననలు పొందాల్సిందే. కార్టూన్లు, చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు శిరంశెట్టి ఆనంద్. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఆనంద్ బొమ్మలే ప్రాణంగా రంగులే ప్రపంచంగా వేలాది కార్టూన్లు గీసి పలువురి మెప్పు పొందారు. ఆయిల్ పెయింటింగ్, అక్రిలిక్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్, పెన్సిల్, స్కెచ్‌లతో ఆనంద్ వేసే కార్టూన్లు వర్తమాన సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఆలోచింపజేస్తుంటాయి. ప్రకృతి రమణీయత, తెలుగింటి ఆడబిడ్డల అందచందాలు అలవోకగా గీయగలరు.
‘చిన్నారుల గీతలు’ పేరుతో పిల్లల కోసం ఓ ప్రత్యేక బొమ్మల పుస్తకాన్ని, సొంత కార్టూన్ల పుస్తకాన్ని వెలువరించారు. దాంతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కోసం గోడలపై స్ఫూర్తిదాయకమైన చిత్రాలను వేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన కార్టూన్ల ద్వారా ప్రజలను జాగృతం చేసేందుకు తెలంగాణ ఉద్యమ గీతలు పుస్తకాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ ఆడబిడ్డలు ఆరాధ్యంగా పూజించే 101 అద్భుతమైన బతుకమ్మ బొమ్మల పుస్తకాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ పుస్తకంలో ఎంగిలి పువ్వు బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు అమ్మవారికి 9 రోజులు నైవేద్యాలు సమర్పిస్తున్న ఆడబిడ్డల బొమ్మలను అందంగా చిత్రించారు ఆనంద్. 33 జిల్లాల్లోని ప్రముఖ ప్రదేశాలతో బతుకమ్మ బొమ్మలు గీసి ఆయా జిల్లాల ప్రత్యేకతను తన బొమ్మల్లో చాటారు. పోరాట యోధులు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కాళోజీ, దాశరథి, కుమ్రం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య జయశంకర్ సార్ వంటి మహానుభావుల చిత్రాలతోపాటు పలువురి ప్రముఖుల చిత్రాలు అచ్చుగుద్దినట్లు గీసి ఆశ్చర్యపరిచారు.
ఎన్నో అవార్డులు, పురస్కారాలు
ఆనంద్ వేసిన కార్టూన్లు, చిత్రాలకు పలువురి ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. జాతీయ పుడమి పురస్కారం, భానుపురి సాహితీ రత్న జాతీయ విశిష్ట పురస్కారం, జాతీయ పురస్కారం సవ్యసాచి, చిత్రబ్రహ్మ, గోల్దెన్ బ్రష్, భానుపురి కళారత్న వంటి ఎన్నో పురస్కారాలు ఆనంద్‌ను వరించాయి. ఆనంద్ వేసిన బతుకమ్మ చిత్రాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు పలువురు మెచ్చుకొని అభినందించారు.
ప్రజలను చైతన్యం చేసేలా చిత్రాలు
సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల ప్రజలను చైతన్యవంతం చేసేలా స్ఫూర్తిదాయకమైన కార్టూన్లు, చిత్రాలు వేస్తుంటాను. 27ఏండ్లుగా కుంచెను నమ్ముకొని జీవిస్తున్నా. నా కుంచె ఎంతో మంది అభిమానులను, అవార్డులను, పురస్కారాలను తెచ్చి పెట్టింది. ప్రతియేటా వేసవిలో పిల్లలకు ఉచితంగా డ్రాయింగ్‌లో శిక్షణ ఇస్తుంటాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచేలా వాల్ పెయింట్స్ వేశాను. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా 101 బతుకమ్మ కార్టూన్లతో రూపొందించిన పుస్తకం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
– ఆనంద్, కార్టూనిస్ట్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

