ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్కారు కృషి
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బాడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- నూతనకల్, వల్లాలలో బడిబాటకు హాజరు
నూతనకల్/ శాలిగౌరారం, జూన్ 15 : ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బాడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా, శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామ మోడల్ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.22వేల కోట్లు మంజూరు చేసిందన్నారు.
ఆ నిధులతో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. నూతనకల్ జడ్పీ పాఠశాలలో బాలికలకు మూత్రశాలలు, కంప్యూటర్ హాల్ నిర్మిస్తామన్నారు. పాఠశాలకు 10 కంప్యూటర్లు అందజేస్తానని, విద్యార్థులకు కంప్యూటర్ విద్య నేర్పించడానికి ప్రైవేటు టీచర్లను నియమిస్తామని హామీ ఇచ్చారు. వల్లాల మోడల్ స్కూల్లో వంట చేసేందుకు గ్యాస్ కనెక్షన్ల కోసం మంత్రి సొంతంగా రూ.2.50 లక్షలు అందజేశారు. ఆగస్టులో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు.
ఇల్లు లేని నిరుపేదలకు రూ.5లక్షలు కేటాయించి త్వరలో ఇండ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్ ప్రియాంక, డీఈఓ అశోక్, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, ఎంపీపీ భూరెడ్డి కళావతి, జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగ జయసుధ, ఎంపీటీసీ పన్నాల రమ, తాసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎంపీడీఓ సునీత, ఎంఈఓ రాములునాయక్, శాలిగౌరారంలో జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, తాసీల్దార్ అన్వర్ హుస్సేన్, ఎంపీడీఓ లక్ష్మయ్య, ఎంఈఓ నాగయ్య, ఎంపీటీసీ మాదగోని కవిత, పాఠశాల ప్రిన్సిపాల్ రాగిణి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

