నల్లగొండ, జూలై 4 : జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య సోమవారం నల్లగొండలోని ఆయన నివాసంలో పరామర్శించారు.
నరేందర్‌రెడ్డి ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయనను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ఉన్నారు.