అంతర్జాతీయ స్థాయిలో బుద్ధవనం అభివృద్ధి
నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం థీమ్ పార్కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెం దుతుందని మాజీ సీఎల్పీ నేత కుందూరి జానారెడ్డి అన్నారు. బుద్ధవనంలో నిర్వహించిన మహా ధ ర్మ చక్ర ప్రవర్తన దినోత్సవంలో కుం దూరు జానారెడ్డి, ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, బాలీవుడ్ నటుడు గగన్‌మాలిక్, వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ రవి శం కర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు.
నందికొండ, జులై 10 : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం థీమ్ పార్కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెం దుతుందని మాజీ సీఎల్పీ నేత కుందూరి జానారెడ్డి అన్నారు. బుద్ధవనంలో నిర్వహించిన మహా ధ ర్మ చక్ర ప్రవర్తన దినోత్సవంలో కుం దూరు జానారెడ్డి, ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, బాలీవుడ్ నటుడు గగన్‌మాలిక్, వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ రవి శం కర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఐపీఎస్ అధికారి చారుసిన్తా బుద్ధగయ నుంచి తెచ్చిన మొక్కను నాటి, మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు సమానత్వ సంఘాన్ని నిర్మించాలని ఆకాంక్షించారన్నారు. ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయస్థాయిలో ప్రఖ్యాతి పొందుతున్న బుద్ధవనం నిర్మాణంలో కుందూరి జానారెడ్డి కృషి ఎందో ఉందన్నారు.
బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారిన అనంతరం ఆషాడ పౌర్ణమి రోజున తన శిష్యులకు ఇచ్చే మొదటి ఉపన్యాసాన్ని పురస్కరించుకొని ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం నిర్వహిస్తారన్నారు. బుద్ధవనంతోపాటు చాకలిగట్టును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, సాగర్ జలాశయంలోని ఐలాండ్‌పై 150 అడుగుల బౌద్ధ విగ్రహాన్ని ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. బాలివుడ్ నటు డు గగన్‌మాలిక్ మాట్లాడుతూ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచ దేశాల్లోని బౌద్ధ కేంద్రాలతో బుద్ధవనాన్ని సమన్వయం చేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆధికారి శాసన, ఎస్టేట అధికారి రవిచంద్ర, ఆర్ట్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్‌రావు, బుద్ధవనం ఇంజినీర్లు శ్రీనివాస్‌రెడ్డి, నజీశ్, దైవజ్ఞ శర్మ, సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ ముత్తయ్య, ఎస్పీఎఫ్ ఎస్ఐ రఘు, యోగా మాస్టర్ సైదయ్య, ఎంజీ యూనివర్సిటీ, బీసీ గురుకుల విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

