నీలగిరి, ఆగస్టు 31 : నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు సంబందించిన దరఖాస్తు అభ్యర్థులకు సెప్టెంబర్ 3న ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యులు నిర్వహించనున్నట్లు సీడీపీఓ చంద్రకళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ ప్రాజెక్టు పరిధిలోని ఐతవారిగూడెం, పెద్దసూరారం-2, వడ్డెరగూడెం, లచ్చుగూడెం, గొల్లగూడ-2, మాన్యంబావి-2 అంగన్వాడీ టీచర్లకు, కన్నెబాయితండా ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఆర్హులైన అభ్యర్థులు కాల్ లేటర్, ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు, ఒక సెట్ జీరాక్స్, రెండు పాస్ఫొటోలతో ఇంటర్వ్యుకు హాజరు కావాలని కోరారు.