Nalgonda City : అంతరాష్ట్ర నకిలీ బంగారం దొంగల ముఠా అరెస్ట్
అంతరాష్ట్ర నకిలీ బంగారం దొంగల ముఠా సభ్యులను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి రూ. 1.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్స్, అర కేజీ నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి శనివారం వెల్లడించారు.
– రూ.1.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్స్, అర కేజీ నకిలీ బంగారం స్వాధీనం
– వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి
నల్లగొండ సిటీ, జనవరి 03 : అంతరాష్ట్ర నకిలీ బంగారం దొంగల ముఠా సభ్యులను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి రూ. 1.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్స్, అర కేజీ నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి శనివారం వెల్లడించారు. 16 డిసెంబర్, 2025న నల్లగొండ వన్ టౌన్ పట్టణ పరిధి నెహ్రూగంజ్ ప్రాంతంలోని వినాయక కిరాణా షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి కిరాణా సామను తీసుకున్నారు. ఈ క్రమంలోనే దుకాణ యజమానితో పరిచయం చేసుకుని, మాటలు కలిపి పాత బంగారం తక్కువ ధరకు రూ.15 లక్షల విలువైన బంగారం కేవలం రూ.5 లక్షలకే ఇస్తామని నమ్మించారు.
నమ్మిన షాప్ యజమాని బ్యాంక్ వద్దకు తీసుకెళ్లి రూ.5 లక్షలు డ్రా చేసి వారికి ఇచ్చాడు. కాగా వారు అతడికి నకిలీ బంగారాన్ని అంటగట్టారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం తన (డీఎస్పీ శివరాం రెడ్డి) ఆధ్వర్యంలో వన్ టౌన్, సీసీఎస్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో నిందితులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ చేసి వారిని పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితులు ఏడుగురు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారుగా వెల్లడించారు. ఏ1-రమేశ్ కుమార్ (30), ఏ2-పురన్ కుమార్ (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు), ఏ3-రాజా రామ్ (38), ఏ4-మహేంద్ర కుమార్ (19), ఏ5-మానా రామ్ (38), ఏ6-సురేశ్ కుమార్ (28), ఏ7- దేవా రామ్ (45). వీరు ప్లాస్టిక్ వస్తువుల అమ్మకం పేరుతో పట్టణ శివారులోని కతాలగూడెం శివారులో గుడిసెలు వేసుకుని కుటుంబ సభ్యులతో జీవిస్తున్నట్లు చెప్పారు. కేసును విజయవంతంగా చేధించిన డీఎస్పీ శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ రాజ శేఖర్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ విజయ్ కుమార్, వన్ టౌన్ ఎస్ఐలు లచ్చిరెడ్డి, వెంకట నారాయణ, సిబ్బంది విష్ణు, రబ్బానీ, అంజయ్య, సిసిఎస్ సిబ్బంది వహీద్, దస్తగిరి, మహేశ్, నాగరాణిని ఎస్పీ అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

