ఈవీఎంలకు పటిష్ట బందోబస్తు
పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరిచినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన, ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.
- జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనాదీప్తి
- అధికారులు, పార్టీల ప్రతినిధులతో కలిసి స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన
నల్లగొండ, మే 14 : పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరిచినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన, ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. సదరు గోదామును మంగళవారం వారు సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ సెంగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను దుప్పలపల్లి గోదాములో నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో భద్రపరిచినట్లు తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్‌కుమార్, మాణిక్‌రావు, సూర్యవంశీ, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎంపీ అభ్యర్థుల సమక్షంలో భద్రపరిచి సీల్ వేయడం జరిగిందన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములతోపాటు దుప్పలపల్లి గోదాం మొత్తం సీఆర్పీఎఫ్, పోలీస్ భద్రతలో ఉన్నదని చెప్పారు. వారి వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి డి.రాజ్యలక్ష్మి, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ కోటేశ్వర్రావు,
డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సంగీతలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భూమన్న, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఆర్డీఓలు, అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ శివరామిరెడ్డి, జిల్లా అధికారులు, ఎలక్షన్ విభాగం సూపరింటెండెంట్ విజయ్, చంద్రవదన, తాసీల్దార్లు, నాయకులు శంకర్‌నాయక్ (కాంగ్రెస్), పంకజ్ యాదవ్ (బీఆర్ఎస్), నూకల నరసింహారెడ్డి (బీజేపీ), ఎంపీ అభ్యర్థులు గోలి సైదులు, చొల్లేటి ప్రభాకర్, సిరిశాల సీనయ్య, స్వతంత్ర అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులు యాదగిరి, నరసింహ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

