తిమ్మాపురంలో భూముల రీ సర్వే పరిశీలన
కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను గురువారం తాసీల్దార్ పుష్పలత పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కట్టంగూర్, నవంబర్ 05 : కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను గురువారం తాసీల్దార్ పుష్పలత పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని సూచించారు. సర్వే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, భూముల హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు. రైతులకు తమ భూములకు సంబంధించిన వివరాలపై ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని సిబ్బందికి సూచించారు. భూముల సర్వే సమయంలో రైతులు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. రీ సర్వే పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీపీఓ జనార్ధన్, సర్వేయర్ అశోక్, వీఆర్ఏ షేక్ లతీఫ్, పలువురు రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తిమ్మాపురంలో భూముల రీ సర్వే పరిశీలన
Damodara Rajanarasimha | టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ డుమ్మా..!
Health tips | బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్‌తో మాత్రమే కాదు.. బ్రౌన్ షుగర్తోనూ ఎన్నో లాభాలు తెలుసా..?
Namaste Effect | నిబంధనలకు విరుద్ధంగా పటాకుల స్టాల్స్ ఏర్పాటు పై చర్యలు
Polling Officer | ఎన్నికల విధుల్లో విషాదం.. గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

