Kodada Rural : కాపుగల్లుకు వంద ఎల్ఈడీ వీధిలైట్లు బహూకరణ
కోదాడ మండల పరిధి కాపుగల్లు గ్రామ వాసి, బీఆర్ఎస్ నాయకుడు దొంతగాని అప్పారావు గ్రామానికి రూ.లక్ష విలువ గల 100 ఎల్ఈడీ వీధిలైట్లు మంగళవారం అందజేశారు.
కోదాడ రూరల్, జూన్ 24 : కోదాడ మండల పరిధి కాపుగల్లు గ్రామ వాసి, బీఆర్ఎస్ నాయకుడు దొంతగాని అప్పారావు గ్రామానికి రూ.లక్ష విలువ గల 100 ఎల్ఈడీ వీధిలైట్లు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణాలకు ధీటుగా పల్లెలు అభివృద్ధి సాధిస్తే, రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెలు అభివృద్ధికి ఆమాడ దూరంలో నిలిచాయన్నారు. ఇప్పటికైనా పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా బోసుబాబు, గోపి, కాసాని గోపి, శ్రీను, వెంకటనారాయణ, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, నరేశ్, సీతారాములు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

