25 గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు
నియోజకవర్గంలోని 25 గిరిజన గ్రామ పంచాయతీల భవనాల మంజూరుకు రూ.5 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు.
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండ, ఫిబ్రవరి 18 : నియోజకవర్గంలోని 25 గిరిజన గ్రామ పంచాయతీల భవనాల మంజూరుకు రూ.5 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. శనివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీల భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా నిధులు మంజూరు చేస్తూ గిరిజన శాఖ నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. నిధులు మంజూరు చేసిన గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతీరాథోడ్, జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
డిండి, చింతపల్లి మండల కేంద్రాలకు చెందిన ఇద్దరికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, నాయకులు మునుకుంట్ల వెంకట్‌రెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ, వడ్త బాలు, ఇలియాస్ పటేల్, సర్పంచులు అంజయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

