నియోజకవర్గ కేంద్రాల్లో సంబురాలు బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చిన ఆశ వర్కర్లు న్యూట్రిషన్ కిట్ పథకానికి శ్రీకారం వైద్యసిబ్బంది, డాక్టర్లకు సన్మానం వైద్య రంగం సాధించిన ప్రగతిపై వివరణరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు, వైద్య ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొన్ని చోట్ల కోలాటం ఆడుతూ బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అన్ని నియోజకవర్గాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్లు అందజేశారు. స్వరాష్ట్రంలో వైద్య రంగంలో వచ్చిన మార్పులు, దవాఖానల్లో సమకూరిన వసతులు, అందుతున్న వైద్య సేవల గురించి వివరించారు.