మోడల్ స్కూల్ టీచర్లకు గుడ్ న్యూస్..బదిలీలకు గ్రీన్ సిగ్నల్
మోడల్ స్కూల్ ఉపాధ్యాయలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. 2013లో విధుల్లో చేరిన నాటి నుంచి నేటి వరకు బదిలీలు లేక ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
- మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ ఆన్లైన్లో దరఖాస్తులు
- ఈ నెల 26 వరకు అవకాశం
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 520 మంది ఉపాధ్యాయులు
రామగిరి, జూలై 5: మోడల్ స్కూల్ ఉపాధ్యాయలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. 2013లో విధుల్లో చేరిన నాటి నుంచి నేటి వరకు బదిలీలు లేక ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తాజా ప్రకటనతో పాఠశాలల్లో పనిచేసే ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తెలంగాణ ఏర్పాటు కంటే ముందే (2013లో)నియాకమైన మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు బదిలీలు లేవు. సుదీర్ఘ కాలం తర్వాత బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండడం మరో వైపు టీచర్ల సీనియార్టీ తేడా రాకుండా ఇప్పటికే ఉపాధ్యాయుల వివరాలను మోడల్ స్కూల్ సొసైటీ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిద్ధం చేసింది. బదిలీల ఉత్తర్వులు ఇవ్వడంతోపాటు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం ఇస్తూ ఈనెల 26 లోగా పూర్తి చేస్తుండడం గమనార్హం. కాగా బదిలీలను పాత జోనల్ పరిగణలోకి తీసుకునే చేయనున్నట్లు సమాచారం.
ఇక బదిలీల ప్రక్రియ ఇలా …
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32 మోడల్ స్కూళ్లు ఉండగా వీటిలో 520 మంది ప్రిన్సిపాళ్లు ,ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే 2013లో పాఠశాలల్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి ఎలాంటి బదిలీలు జరుగలేదు. అయితే కొందరు ఉపాధ్యాయులు 2014లో చేరారు. సీనియార్టీ జాబితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచే తయారు చేస్తున్నారు. పూర్తి ఆన్లైన్ విధానంలో సాగుతుండడంతో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా పారదర్శకంగా ప్రక్రియ సాగనుంది.
సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలి
బదిలీలకు అవకాశం ఇవ్వడం హర్షణీయం. తెలంగాణ ఏర్పాటు కాకముందే మేం ఉద్యోగంలో చేరాం. ఇప్పటి వరకు బదిలీలు లేక ఒకే చోట పనిచేస్తూ ఇబ్బంది పడుతున్నాం. అయితే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బదిలీలను సజావుగా చేసి అందరిలో సంతోషం నింపాలి. సుదీర్ఘకాలం తర్వత బదిలీలు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– డి.సుజాత, టీజీటీ గణితం
స్వాగతిస్తున్నాం
సుదీర్ఘ కాలం తర్వాత ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల బదిలీపై గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. బదిలీలను వెంటనే పూర్తి చేసేలా షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. బదిలీల్లో స్పౌజ్, సర్వీస్ పాయింట్స్, ఇంటర్ సీనియార్టీ తదితర అంశాల్లో న్యాయం చేయాలి.
– తరాల జగదీశ్, రాష్ట్ర అధ్యక్షుడు, పీఎంటీఏటీఎస్
షెడ్యూల్ ఇలా..
- ఈనెల 5నుంచి 7వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం
- ఈనెల 8న ఫైనల్ వెకేషన్ లిస్ట్ ఇన్ వెబ్సైట్
- ఈనెల 9 నుంచి 13వరకు ప్రిన్సిపాళ్ల బదిలీల దరఖాస్తులు,ఉపాధ్యాయుల వివరాలను నిర్ధారణ
- 14న బదిలీలకు అవసరమైన ప్రొవిజినల్ పాయింట్స్ ఆన్లైన్లో వెల్లడి.
- 18 నుంచి 19వరకు బదిలీలకు(ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీ)ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం
- 20నుంచి 22 వరకు బదిలీల లిస్టు సబ్జెక్టువారీగా విడుదల చేయడంతోపాటు పరిశీలన
- 21నుంచి 23వరకు బదిలీలు అయిన ప్రాంతాల ఉత్తర్వులు అందజేత
- బదిలీల ఉత్తర్వులు పొందిన వారంతా 23నుంచి 26వరకు ఆయా పాఠశాలల్లో చేరడం
- ఈనెల 23 నుంచి 29 వరకు బదిలీలపై అభ్యంతరాల స్వీకరణ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

