‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
బీఈడీ, బి పిఈ డి, ఎంపీఈడీ, ఎంఈడి కళాశాలల తో పాటు అన్ని కళాశాలల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థుల హాజరు నమోదు నుండి తరగతుల నిర్వహణ వరకు ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు.
– విద్యార్థుల, అధ్యాపకుల హాజరు, తరగతుల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు
– కళాశాలల వారీగా అడ్మిషన్ల పరిస్థితిపై సమీక్ష
-.నిర్లక్ష్యంపై ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆగ్రహం
రామగిరి, అక్టోబర్ 09 : బీఈడీ, బి పిఈ డి, ఎంపీఈడీ, ఎంఈడి కళాశాలల తో పాటు అన్ని కళాశాలల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థుల హాజరు నమోదు నుండి తరగతుల నిర్వహణ వరకు ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. అన్ని కళాశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ఆధారిత అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెల 23 నుండి యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో, ఆ తర్వాత 15 రోజుల్లో యూనివర్సిటీలోని అన్ని పీజీ కళాశాలలో ఎఫ్ఆర్ఎస్ అమలవుతుందన్నారు. అనుబంధ కళాశాలలో కూడా ఎఫ్ఆర్ఐస్ మిషన్లను తీసుకుని డిసెంబర్ మొదటి వారంలోగా అమలు చేసే విధంగా ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని ఎంజియూఆర్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతిని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని వీసీ తెలిపారు.
ఉపాధ్యాయ విద్యలో నాణ్యతే ప్రథమ ప్రాధాన్యం
బీఈడీ కళాశాలలు కేవలం డిగ్రీలు అందించే విద్యాసంస్థలుగా కాకుండా, భవిష్యత్తు తరాలకు విద్యాబుద్ధులు నేర్పే ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేసే కేంద్రాలుగా నిలవాలని వీసీ పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించడంతోపాటు బోధనా నైపుణ్యాలు, వృత్తిపరమైన విలువలు పెంపొందించేలా కళాశాలలు పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయ విద్యలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. అన్ని కళాశాలలో కచ్చితంగా 10 మంది అధ్యాపకుల హాజరు నమోదు కావాలని సూచించారు.
ఆకస్మిక తనిఖీలతో కళాశాలల పనితీరుపై నిఘా
బీఈడీ, బిపి ఎడి, ఎంఈడి ఎంపీఈడీ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, విద్యా కార్యకలాపాల అమలును పరిశీలించేందుకు యూనివర్సిటీ అధికారులచే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేపడతామని వీసీ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కళాశాలల పనితీరును పరిశీలించి, నిబంధనల అమలుపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. విద్యా ప్రమాణాలను కాపాడటంలో ప్రతి కళాశాల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
అడ్మిషన్ల పరిస్థితిపై కళాశాలల వారీగా సమీక్ష
కళాశాలల వారీగా అడ్మిషన్ల పరిస్థితిని తెలుసుకున్న వీసీ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్, ప్రవేశాల ప్రక్రియతోపాటు కళాశాలల నిర్వహణ తీరుపై సమీక్ష నిర్వహించారు. ఆయా కళాశాలల పనితీరు, విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంబంధిత బాధ్యులకు సూచనలు చేశారు. నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించే కళాశాలలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనితీరును మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేశారు. ఎంజియూ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై. ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆడిట్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.జయంతి, ఆడిట్ సెల్ కో ఆర్డినేటర్ సమ్రిన్ కాజ్మీ, ఎంజియూ బీఈడీ కళాశాలల అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ జబ్బర్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

