అభివృద్ధిని మరిచిన కాంగ్రెస్ సర్కారు
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు, అభివృద్ధిని పూర్తిగా మరిచిందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రం సాధించి పదేండ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని, ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆయా వర్గాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
- నిరుత్సాహ పడొద్దు.. ప్రజలకు కాపలాదారులుగా ఉందాం
- బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్
- ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు
సూర్యాపేట టౌన్, జూన్ 3 : ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు, అభివృద్ధిని పూర్తిగా మరిచిందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రం సాధించి పదేండ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని, ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆయా వర్గాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సభ్యత్వాలతో, బలమైన గ్రామ శాఖలతో నిర్మాణం జరిగిందన్నారు.
ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పడిపోతుందని కాంగ్రెస్ నాయకులు పిచ్చి కలలు కంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ జేజేమ్మలు వచ్చినా తెలంగాణలో కేసీఆర్‌కు తిరుగు లేదని అన్నారు. సెగ్రిగేషన్ షెడ్లు, ట్రాక్టర్లు, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, హరితహారంతోపాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. పదేండ్లపాటు పరిశుభ్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆరు నెలల్లో అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో తాము వేరే పార్టీల్లో ఉన్నప్పటికీ తెలంగాణ పాటలు వింటున్నప్పుడల్లా ఏదో తప్పు చేస్తున్నామని భవిష్యత్ తరాలు మనలను క్షమించవని భావించి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో భాగస్వాములమయ్యామని చెప్పా రు.
ప్రభుత్వం మారినంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై ఈగ వాలినా సహించబోమని హెచ్చరించారు. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ అని, రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ మోసం చేసిందని ప్రజలు గ్రహించారని తెలిపారు. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయని, ఒకరంటే మరొకరికి పడడం లేదని, ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం మనజాలదని అన్నారు. సంవత్సరంలోపు నలుగురు ముఖ్యమంత్రులు తయారవుతున్నారని, మరో 8మంది తమను మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకుంటారా? అని ఎదురు చూస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు కాపలాదారులుగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు ఎస్ఏ రజాక్, జడ్పీటీసీలు జీడి భిక్షం, దావుల వీరప్రసాద్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో విజయం మనదే
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మో సం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదు. చావు అంచులకు వెళ్లి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ పదేండ్లు కంటికి రెప్పలా కాపాడుకొని అ న్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. గ్రామాల్లో ఆరు నెలలుగా అభివృద్ధి ఆగిపోయింది. సమస్యలు చెప్పుకొనేందుకు బీఆర్ఎస్ నాయకులు ఎక్కడున్నారని ప్రజలు దేవులాడుకుంటున్నారు. ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత వచ్చి స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయం.
కేసీఆరే శరణ్యమంటున్న ప్రజలు
తెలంగాణ రాష్ర్టాన్ని దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే. ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండడంతో ప్రజలు మళ్లీ కేసీఆరే శరణ్యమంటున్నారు. పదేండ్లలో తెలంగాణలో అన్ని రంగాల ప్రజలు అభివృద్ధి చెందారు. మార్పు అంటూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలను, అభివృద్ధిని మరిచారు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం.. నాయకులు, కార్యకర్తలు సమన్వయం పాటిస్తూ పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

