రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
ఎల్ నినో పరిస్థితిలను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగిలో ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎల్ నినో ప్రత్యేక అధికారి దాసరి హరిచందన అన్నారు. వ్యవసాయం, పంటలు, తాగునీరు, విద్యుత్ తదితర అంశాలపై ఎల్ నినో ప్రభావంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా...
నల్లగొండ సిటీ, అక్టోబర్ 16 : ఎల్ నినో పరిస్థితిలను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగిలో ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎల్ నినో ప్రత్యేక అధికారి దాసరి హరిచందన అన్నారు. వ్యవసాయం, పంటలు, తాగునీరు, విద్యుత్ తదితర అంశాలపై ఎల్ నినో ప్రభావంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షించే నిమిత్తం శుక్రవారం ఆమె నల్లగొండ జిల్లాకు విచ్చేశారు. సమీక్ష అనంతరం ఆమె కనగల్ మండలం, శేరిలింగోటం వద్ద నీరు లేక ఎండిపోయిన వరి, పత్తి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శేరిలింగోటం గ్రామానికి చెందిన వరి, పత్తి రైతులతో ఆమె ముఖాముఖి మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం వల్ల వానాకాలం సరైన వర్షాలు రావని, అందువల్ల రైతులు వరి పంట సాగు చేయవద్దని వ్యవసాయ అధికారులు, జిల్లా యంత్రాంగం పదేపదే రైతులకు చెప్పినప్పటికి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వరి సాగు చేయడం జరిగిందన్నారు. వరి పంట చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, అలాగే పత్తి పంటలు కూడా ఎండిపోతున్నాయని, దీనివల్ల రైతులకు నష్టం కలుగుతుందని అన్నారు.
ఎల్ నినో వల్ల ఎక్కువనీరు అవసరం అయ్యే పంటలు వేస్తే భూగర్భ జలాల అధిక వినియోగంతో పాటు, విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందని, అంతేకాక ఏదో కారణం చేత పంట చేతికి రాకపోతే రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాలన్నీ సొంతంగా అనుభవించిన రైతులు తోటి రైతులకు వారి అనుభవాలను తెలియజేయాలని, మరో రైతు నష్టపోకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యాసంగిలో జిల్లా రైతులు బోర్లు, బావుల కింద ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దని, దీనివల్ల అన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. ఇదే విషయాలు తోటి రైతులతో పాటు, ఇతర ప్రాంతాల రైతులకు కూడా తెలియజేసి వారు నష్టపోకుండా చూడాలని కోరారు. తక్కువ నీరు అవసరమయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేసుకునేందుకు ప్రభుత్వం విత్తనాలు, ఇతర సహకారం అందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి శేఖర్, ఏఈవోలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

