‘రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి’
ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువు ఏర్పడిన నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరువు యాత్రలో భాగంగా సోమవారం చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను సిపిఐ బృందం పరిశీలించింది. గ్రామంలో...
– సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
చండూరు, నవంబర్ 02 : ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువు ఏర్పడిన నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరువు యాత్రలో భాగంగా సోమవారం చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను సిపిఐ బృందం పరిశీలించింది. గ్రామంలో సుంకరి లింగయ్య శాంభవి, సుంకరి రాములు పంట పొలంను పరిశీలించిన అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరువును జాతీయ విపత్తుగా గుర్తించి ప్రజలను, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చండూరు మండలంలో 28 వేల ఎకరాల పైచిలుకు పత్తి, 2 వేల 500 ఎకరాలలో వరి పంట సాగు చేయడం జరిగిందని, అదేవిధంగా బంగారుగడ్డ గ్రామంలో 2,098 ఎకరాల పత్తి పంట సాగు చేయగా వరి పంటను 168 ఎకరాలలో సాగు చేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయల పెట్టుబడులుగా పెట్టిన రైతులు పంటలు చేతికందక నష్టాల పాలయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, తీర్పారు వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పిటిసి మాధవని విజయలక్ష్మి, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొడ్డు వెంకటేశ్వర్లు, బండమీది వెంకన్న, గంట రమేష్, ఇరిగి సంజీవ పల్లె శంకరయ్య, మాజీ సర్పంచులు బోయపల్లి జంగయ్య, బోయపల్లి భిక్షమయ్య, జోగు రమేష్, లింగయ్య తలారి ముత్తయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి’
Sivakarthikeyan | షూటింగ్‌లోనే దర్శకుడికి ఖరీదైన బహుమతి.. శివకార్తికేయన్ మంచి మనసుపై నెటిజన్ల ప్రశంసలు!
పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా? : వీడియో
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఎంపిక
K-Hub | కాకతీయ యూనివర్సిటీ కే-హబ్‌కు వృథా ఖర్చు..! కోట్ల భవనం నిరుపయోగం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

