Interview | మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటా: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ తనకు మరోసారి టికెట్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని, మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని తెలిపారు.
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ తనకు మరోసారి టికెట్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని, మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని తెలిపారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒకొకటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నానని నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నమస్తే తెలంగాణ : 2018లో ఇచ్చిన హామీలు అమలైనట్లేనా?
ఎమ్మెల్యే : దాదాపుగా ఇచ్చిన హామీలన్నింటినీ ఒకొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే అన్నీ పూర్తికావచ్చాయి. ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తాం.
నమస్తే తెలంగాణ : మరోసారి అభ్యర్థిగా అవకాశం రావడంపై మీ ఫీలింగ్?
ఎమ్మెల్యే : చాలా ఆనందంగా ఉంది. నాపై మరింత బాధ్యత పెరిగింది. నన్ను ఆదరించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు మరో అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నా. ప్రజల రుణం తీర్చుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తా. నాకు ఐదోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా.
నమస్తే తెలంగాణ : టికెట్ ప్రకటన తరువాత పార్టీ శ్రేణుల స్పందన?
ఎమ్మెల్యే : అన్ని గ్రామాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణుల్లో చెప్పలేని ఆనందం నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ గెలుపు ఖాయంగా అందరూ చెబుతున్నారు.
నమస్తే తెలంగాణ : ఎన్నికల ప్రచారం ఎప్పటి నుంచి?
ఎమ్మెల్యే : ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. నిత్యం ఉదయం ఏడు గంటల నుంచి నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నా. ప్రత్యేకమైన ప్రచారం అంటూ ఏమీ ఉండదు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని నేను. పండుగలకు వచ్చే చుట్టాల మాదిరిగా ప్రతిపక్షాలకు ప్రచారం కావాలి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి.
నమస్తే తెలంగాణ : ఉప ఎన్నిక హామీలను ఏమేరకు అమలు చేశారు?
ఎమ్మెల్యే : దాదాపుగా అన్ని పూర్తి కావచ్చాయి. ఒకటి, రెండు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. వంద పడకల ఆస్పత్రి నిర్మాణం చౌటుప్పల్‌లో శరవేగంగా సాగుతున్నది. ఇచ్చిన హామీ మేరకు 30 పడకల ఆస్పత్రులు కూడా త్వరలోనే పూర్తికానున్నాయి.
నమస్తే తెలంగాణ : ప్రత్యర్థులపై మీ అంచనా?
ఎమ్మెల్యే : నాకు ప్రత్యర్థులంటూ ఎవరూ లేరు. ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో అంతా నివ్వెరపోతున్నారు. పోటీలో ఎవరు ఉన్నా.. మరోసారి నా గెలుపు ఇప్పటికే ఖరారైంది.
నమస్తే తెలంగాణ : ప్రజలకు ఏం చెప్పబోతున్నారు?
ఎమ్మెల్యే : ఉప ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ నేను సర్వదా రుణపడి ఉంటాను. సమయం తకువగా ఉండడంతో ఉదయం ఏడు గంటల నుంచి కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నా. ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల ముందు నిలబడతా.
నమస్తే తెలంగాణ : మీ ముందున్న నియోజకవర్గ లక్ష్యాలు?
ఎమ్మెల్యే : అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు లింక్ రోడ్లను ఏర్పాటు చేయడం, ప్రధాన రోడ్లను మెరుగుపర్చడం, మున్సిపాలిటీలను తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నా. చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతా. రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.400 కోట్లతో అంచనాలు రూపొందించాం. పనులు పూర్తికావాలంటే వచ్చే ఎన్నికల్లో మరో అవకాశం ఇవ్వాలి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

