– సీనియర్ న్యాయవాది శేరి చత్రపతి
కట్టంగూర్, జూన్ 12 : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీనియర్ న్యాయవాది శేరి చత్రపతి అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 సంవత్సరాల లోపు బాల బాలికలను ఏ విధమైన పనుల్లో నియమించడం చట్టరీత్యా నేరమన్నారు. బాలల హక్కులను కాపాడడం, వారికి నాణ్యమైన విద్యను అందించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధుల బాధ్యత అన్నారు. అనంతరం బాలల హక్కులు, బాల కార్మిక నిషేద చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. న్యాయవాదులు, పానెల్ సభ్యులు చంద్రపాల్, కొండ యాదగిరి, ఎన్. మల్లేశం, స్థానిక సర్పంచ్ బెల్లి సుధాకర్, ఉప సర్పంచ్ గోపగాని లింగమ్మ, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.