22లోగా పోస్టల్ బ్యాలెట్ ఫామ్ అందజేయాలి
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం-12ను ఈ నెల 22లోగా అందజేయాలని, ఆయా సంబంధిత శాఖల అధికారులు కూడా ధ్రువీకరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు.
- జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన
నీలగిరి, ఏప్రిల్ 19 : ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం-12ను ఈ నెల 22లోగా అందజేయాలని, ఆయా సంబంధిత శాఖల అధికారులు కూడా ధ్రువీకరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్‌పై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా శాఖల ద్వారా ఎంత మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12 జారీ చేసింది, ఎంతమంది తిరిగి ఇచ్చింది డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఏ ఉద్యోగి కూడా పోస్టల్ బ్యాలెట్ రాలేదని ఫిర్యాదు చేయకూడదని, ఒకవేళ అలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులు, డ్రైవర్లు, ఆఫీసు సబార్డినేట్లు సైతం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకా ఎవరైనా శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12 తీసుకోనట్లయితే తక్షణమే తీసుకొని పూర్తి వివరాలతో నింపి సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి ఈనెల 22 నాటికి సమర్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ నోడల్ అధికారులతో సమీక్షిస్తూ ఆయా అంశాల వారీగా తగు సూచనలను జారీ చేశారు.
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, తకువ ఓటింగ్ శాతం ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, హోం ఓటింగ్‌పై మరోసారి సమావేశాన్ని నిర్వహించాలని, సి-విజిల్, సువిధ వంటి యాప్‌లు చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

