‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టడం సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి భిన్నంగా మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఇతర రాజకీయ పార్టీలు మంత్రివర్గ నిర్ణయానికి భిన్నంగా నార్లపురం నుండి తీసుకెళ్లాలని...
– ఏదుల్లా రిజర్వాయర్ నుండి డిండి ఎత్తిపోతల పథకమును మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు చేయాలి
– సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నల్లగొండ, అక్టోబర్ 17 : మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టడం సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి భిన్నంగా మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఇతర రాజకీయ పార్టీలు మంత్రివర్గ నిర్ణయానికి భిన్నంగా నార్లపురం నుండి తీసుకెళ్లాలని ప్రతిపాదించడాన్ని సిపిఐ ఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందించాల్సిన డిండి ఎత్తిపోతల పథకానికి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గం నీటిని సేకరించాలని లక్ష్యంతో ఈ పథకాలకు డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు నార్లపూరు- ఏదుళ్ల మధ్యన మహబూబ్నగర్ ప్రజాప్రతినిధులు అడ్డంగా మాట్లాడటం నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం నీటి పారుదల రంగ నిపుణుల సూచనలతో పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు రెండిటికి కలిపి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 60 వరద రోజులలో నీటిని తరలించాలని నిర్ణయించింది. వచ్చే నీటిలో ప్రతిరోజు 1.5 టీఎంసి చొప్పున 90 టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతలకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీల నీటిని డిండికి కేటాయించాలని నిర్ణయించారు. దీని ప్రకారం పనులు ప్రారంభించారు.
శివన్నగూడెం, కిష్టరాంపల్లి, సింగరాజుపల్లి, గొట్టిముక్కుల జలాశయాల నిర్మాణ పనులు పూర్తి అయినట్లు తెలిపారు. రూ.1,800 కోట్లతో మంత్రివర్గంలో నిర్ణయించి పరిపాలన అనుమతులు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఒప్పందాలు కూడా పూర్తయినవి అన్నారు. ఇంకా భూసేకరణ జరగకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కోసం పాలమూరు ప్రజా ప్రతినిధులు ఇతర రాజకీయ పార్టీలు అడ్డంగా మాట్లాడటం క్షమించరని నల్లగొండ జిల్లా ప్రజల తరఫున సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. నల్లగొండ జిల్లా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. జిల్లాకు నీటి జలాలు కేటాయింపులో ఏ ఒక్క టీఎంసీ తగ్గిన తాము ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను, రైతులను సమీకరించి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలబడాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

