శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేని కారణంగా రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు తలెత్తాయని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన బైరు అశ్విని...
గుర్రంపోడు, అక్టోబర్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేని కారణంగా రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు తలెత్తాయని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన బైరు అశ్విని సాగునీరు రాక, కరెంటు లేక తమ గ్రామంలో వేసిన వరి చేలు, పండ్ల తోటలు ఎండిపోతున్నాయని, పంటలను కాపాడుకునేందుకు తమ నాన్నతో పాటు, తమ నాన్న లాంటి నాన్నలు ఎంతో కష్టపడుతున్నారని, వాళ్ల కష్టం చూసి ఒక ఆడబిడ్డగా తాను తట్టుకోలేకపోతున్నానని, తమకు న్యాయం చేయండి అన్నా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఈ పోస్టుకు స్పందించిన కేటీఆర్ ఆదేశాల మేరకు నోముల భగత్ కుమార్ పోచంపల్లి గ్రామానికి వెళ్లి బైరు అశ్విని కుటుంబ సభ్యులను కలిసి వారి సమస్యను ఆలకించారు. వేసిన నాలుగు ఎకరాల పొలంలో రెండు ఎకరాలు ఇప్పటికే పూర్తిగా ఎండిపోయిందని, మరో ఆరు ఎకరాల తోట కూడా నీరు లేక వాడు బట్టి పోతుందని తెలిపారు. దీనిపై నోముల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని, రాబోయే కాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు నీటిని ఏ విధంగా వాడుకోవాలో, కరెంటు ఏ విధంగా వాడుకోవాలో కేసీఆర్‌కు తెలిసినంతగా రాష్ట్రంలో మరెవరికి తెలువదన్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేస్తే చేతికి వచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని, రైతుకు ఆత్మహత్యే శరణ్యం అనిపిస్తుందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పోచంపల్లి గ్రామస్తుల సాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. అలాగే రోజుకు 15 గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వెంటనే పూర్తి చేయాలన్నారు. పోచంపల్లి గ్రామ సాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసి ఒట్టికోడు వద్ద ఉన్న శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ను పూర్తి చేయడం ద్వారా పోచంపల్లి గ్రామానికి సాగునీరు ఇవ్వొచ్చని నోముల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

