ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ఖమ్మం- నల్లగొండ- వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా నవంబర్ 6వ తేదీ వరకు ఓటరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని కోరుతూ...
– నవంబర్ 6 వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని పట్టబద్రులకు విజ్ఞప్తి
నల్లగొండ, అక్టోబర్ 14 : ఖమ్మం- నల్లగొండ- వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా నవంబర్ 6వ తేదీ వరకు ఓటరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని కోరుతూ బుధవారం నల్లగొండ పట్టణంలోని పలువురి గృహాలకు వెళ్లి వారిని కోరడంతో పాటు గ్రాడ్యుయేట్ల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం యేటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే యువకులు, పట్టభద్రులు అంతా ఓటరుగా నమోదు చేయించుకుని బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్రెడ్డికి ఓటేసి గెలిపించాలి
తెలంగాణ జాతిపిత కెసిఆర్ నాయకత్వంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా అంతా బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. పీఆర్సీ, డీఏల విషయంలో అలాగే సీపీఎస్ రద్దు అంశంలో, 376, 46 జీవోల విషయంలో అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటినా ఏ ఒక్క హామీని అమలు చేయని ప్రభుత్వంపై తిరగబడాల్సిన అవసరం ఉందన్నారు. గ్రాడ్యుయేట్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా అందరూ ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వం
అలాగే రైతు సోదరులంతా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారి కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించి రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. రైతులు పడుతున్న కష్టాలు, శ్రమ, తమ బాధలను కుటుంబంలో గ్రాడ్యుయేట్స్ గా ఉన్న అందరికీ తెలియజేసి కరెంటు ఇవ్వక, సాగునీరు ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, రైతుల సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు రైతుల పొట్ట కొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించేలా తమ కుటుంబ సభ్యులైన గ్రాడ్యుయేట్లకు తెలియజేయాలని, అందరిని ఓటరుగా నమోదు చేయించాలని భూపాల్ రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లను, వ్యాపారస్తులను, బిల్డర్లను, రైతాంగాన్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటరుగా నమోదు చేయించుకుని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రెండవ డివిజన్ కార్పొరేటర్ పెరికే యాదయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, పార్టీ పట్టణ కార్యదర్శి కాసం శేఖర్, కాసం సంతోష్ కుమార్, వీరెల్లి సతీష్ కుమార్, నాగరాజు, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

