అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మిర్యాలగూడ అభ్యర్థి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు సూచించారు. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు బీఫామ్ అందించారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు.