రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూర్ సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో వరి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, సాగు కోసం పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని...
రామగిరి, అక్టోబర్ 22 : పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూర్ సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో వరి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, సాగు కోసం పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతుల దుస్థితిని ప్రభుత్వాలు అర్థం చేసుకుని వారికి తగిన సహాయం అందించాలని కోరారు. గురువారం నల్లగొండ నగరంలోని సీపీఐ(ఎం) కార్యాలయం దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయం సరిపోదని అన్నారు. రైతుల నష్టాలను పరిగణనలోకి తీసుకుని వారికి తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు అత్యవసరంగా అవసరమన్నారు. గ్రామీణ పేదలకు పని కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని పేర్కొన్నారు.
జాతీయ సమైక్యతకు బీజేపీ ప్రభుత్వం ప్రమాదకరం
విజయదశమి రోజున ప్రధానమంత్రి జాతీయ సమైక్యత గురించి మాట్లాడారన్నారు. అయితే ప్రస్తుతం దేశంలో జాతీయ సమైక్యతకు బీజేపీ ప్రభుత్వమే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలను బలహీనపరచాలని, రాజకీయంగా విడగొట్టాలని చూస్తున్న ధోరణి దేశ సమైక్యతను దెబ్బతీస్తుందన్నారు. దేశ సమైక్యతను కాపాడాలంటే ప్రజలను విభజించే విధానాలను విడనాడాలని పేర్కొన్నారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని బి.వి. రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం పార్లమెంటు స్థానాలను కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల సంఖ్య అధికంగా పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించే విధంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల మంది ఓటర్లను తొలగించారని బి.వి. రాఘవులు పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడం ద్వారా దేశ సమైక్యతను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల రూపకల్పనలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించాలని అన్నారు. జనాభా లెక్కల సేకరణలోనూ పారదర్శకత ఉండాలని రాఘవులు సూచించారు. సమాజంలోని అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించే విధంగా కులగణన చేపట్టాలని, సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

