– బీఆర్ఎస్ అమెరికా శాఖ ప్రధాన కార్యదర్శి నాగులవంచ నర్సింహ్మ రావు
– గుర్రంపోడులో సీసీ కెమెరాలు ప్రారంభం
గుర్రంపోడ్, అక్టోబర్ 08 : ప్రజల రక్షణ, నేరాల నియంత్రణ, నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని బీఆర్ఎస్ అమెరికా శాఖ ప్రధాన కార్యదర్శి నాగులవంచ నర్సింహ్మ రావు అన్నారు. గురువారం మండలంలో తన సోంత ఖర్చులు రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. నేరం జరిగినపుడు దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటుతో పాటు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతి రావు, మాజీ ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్ రావు, సర్పంచులు చెవ్వు రమేష్, అందుగుల శ్రీను, సల్వాది సరస్వతి నగేష్, జక్కల స్వప్నభాస్కర్, పిల్లి ఉమరాణి అభినయ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పామనగుండ్ల వెంకన్న, నాయకులు సింగం ప్రవీణ్, కామల్ల రాములు,వెలుగు శంకర్, నాగులవంచ నాగేశ్వర్రావు, షేక్ సిరాజ్, కూనూరు సైదిరెడ్డి, దోటి గణేష్, చింతరెడ్డి రవీందర్ రెడ్డి, పర్సనబోయిన వెంకన్న, కొండ్రపల్లి గిరి, ఏలుకొండ నగేష్, వనమాల మహేందర్, షేక్ ఖాసీం పాల్గొన్నారు.