బీఆర్ఎస్వీ నల్గొండ జిల్లా నాయకుడు నవీన్ అరెస్టు
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, నార్కట్‌పల్లి బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పుల్లెంల వెంకట్ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
నల్లగొండ : పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, నార్కట్‌పల్లి బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పుల్లెంల వెంకట్ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే వారిని అదుపులోకి తీసుకుని నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరని మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు.
విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెలబెట్టుకోవడం లేదని.. హామీలను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని.. రేవంత్ సర్కార్ గద్దె దిగే రోజులు ముందున్నాయని విమర్శించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే తెలంగాణలో ఎక్కడా తిరగనివ్వమని స్పష్టం చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

