చండూరు, ఏప్రిల్ 25: మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ తల్లి బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటలకు గ్రామదేవతలకు పూజలు, అభిషేకాలు జరిపారు. ఎనిమిది గంటలకు పురుషులు నీటిబిందెలతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు కంఠమహేశ్వర స్వామి–సురమాంబ అమ్మవారికి బోనాలు సమర్పించారు.
మట్టి లేదా రాగి, బెల్లం పరమాన్నం, పెసరపప్పు అన్నం లేదా పలు దినుసులతో అన్నం వండి బోనం సిద్ధం చేశారు. కుండను చిన్న వేపాకులు, పసుపు, కుంకుమ, తెల్ల ముగ్గుతో అలంకరించి పైన దీపం పెట్టి మహిళలు బోనాలు ఎత్తుకొని పెద్ద సంఖ్యలోడప్పుల చప్పుళ్లు, డీజే మోతల మధ్య పాటలు పాడుతూ ర్యాలీగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి సురమాంబ అమ్మవారికి బోనాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో కుల పెద్ద గౌడ్ నకరికంటి సైదులు గౌడ్, సరికొండ ముత్యాలు గౌడ్, చనగాని జంగయ్య గౌడ్, సరికొండ నరేష్ గౌడ్, సరికొండ సైదులు గౌడ్, చనగాని విజయ్ గౌడ్, సరికొండ వెంకటేష్ గౌడ్, చెదురు వెళ్లి సత్తయ్య గౌడ్, చేదురవెల్లి నరసింహ గౌడ్, చేదురవెల్లి దశరథ గౌడ్, చనగాని శీను గౌడ్, చదరవెల్లి జంగయ్య గౌడ్, నకరికంటి స్వామి గౌడ్, కొయ్యడి నాగరాజుగౌడ్, కొయ్యడు వెంకటరమణ, చేదురువెల్లి శంకర్ గౌడ్, సరికొండ మారయ్య గౌడ్, కారింగు నరసింహ గౌడ్, కారింగు సైదులు గౌడ్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.