నకిలీ బంగారం పెట్టి బ్యాంకు లోన్
నకిలీ బంగారం పెట్టి బ్యాంకును మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు హుజూర్నగర్ సీఐ చలమందరాజు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చెప్పారు.
- రూ. 53.89 లక్షలు మోసం చేసిన ఇద్దరి అరెస్ట్
నేరేడుచర్ల, జూన్ 25 : నకిలీ బంగారం పెట్టి బ్యాంకును మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు హుజూర్నగర్ సీఐ చలమందరాజు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చెప్పారు. నేరేడుచర్ల మండలం వైకుంఠాపురం గ్రామానికి చెందిన కేశవరపు రాజేశ్ మిర్యాలగూడలో రాజేశ్ గోల్డ్ వర్క్ షాప్ పెట్టి నష్టపోయాడు. దాంతో
చేసిన అప్పులు తీర్చడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి, నెల్లూరు నుంచి నకిలీ బంగారు కట్టు (గొలుసు) తయారు చేయించాడు.
ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ బంగారు ఆభరణాలపై హోల్‌మార్క్ కేడీఎం 916 ముద్ర వేయించాడు. గరిడేపల్లి మండలం రాయినిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రయిజర్‌గా పని చేస్తున్న నల్లగొండ జిల్లా బొమ్మకల్లు గ్రామానికి చెందిన జిల్లేపల్లి నరేందర్‌తో ఉన్న పాత పరిచయంతో ఆయనను కలిశాడు. ‘నేను తీసుకొచ్చే బంగారం నిజమైనది. నువ్వు ధ్రువీకరిస్తే నాకు బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేస్తాడు. లోన్ మంజూరైన తర్వాత నీకు కొంత నగదు ఇస్తాను’ అని చెప్పడంతో నరేందర్ ఒప్పుకొన్నాడు.
వీరిద్దరు కలిసి బ్యాంకును భారీగా మోసం చేయడం ప్రారంభించారు. రాజేశ్ తన పేరు మీద నకిలీ బంగారం పెట్టి లోన్ తీసుకోవడంతో పాటు అతని భార్య వర్షిత, అతడి బంధువులు కొమెరపూడి వెంకటాచారి, కణితి సాయిరాం, యర్రగొర్ల పరశురాం, దోనేటి ముఖేశ్, మోత్కూరి సూర్య చేత విడుతల వారీగా నకిలీ బంగారం పెట్టి సుమారు రూ. 53.89 లక్షలు లోన్ తీసుకున్నారు. మే 10 న రెన్యూవల్ కోసం వెళ్లగా మోసాన్ని
బ్యాంక్ అధికారులు గుర్తించారు. బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు కేశవరపు రాజేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని హుజూర్నగర్ న్యాయస్థానం ముందు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

