అర్వపల్లి, మే 23 : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం బొల్లంపల్లి గ్రామానికి చెందిన సింగర్ అనిల్ యాదవ్ స్వరకల్పనలో రాబోతున్న అందమైన ఓ చిన్నదాన అనే పాట చిత్రీకరణ శనివారం బొల్లంపల్లిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. అందరి గుండెలకు హత్తుకుని, ఆకట్టుకునే విధంగా ఈ పాట ఉంటుందని అందరూ తప్పకుండా ఆదరించాలని ఆయన కోరారు. నటుడుగా ఉద్యమ కెరటాలు సినిమా హీరో చందు రాగం, నటి రుచిత, దర్శకత్వం యశ్వంత్ మాచర్ల, సినిమాటోగ్రఫీ పవన్, చరణ్ చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు నాని, నవీన్, ఇతర నటీనటులు పాల్గొన్నారు.