సకల సౌలత్‌ల గుట్ట
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో తరించే భక్తులకు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల విడిది కోసం కాటేజీలు, సదన్లు, సత్రాలను సకల సౌలత్‌లతో నిర్మించారు. సామాన్యుల నుంచి వీవీఐపీ భక్తులు రెండు, మూడ్రోజులు ఇకడే ఉండి దర్శించుకునేలా వసతులు కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- యాదగిరిగుట్ట క్షేత్రంలో అన్ని వసతులు
- సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు మంచి బస
- అందుబాటులో సదన్లు, గెస్ట్ హౌస్‌లు, విల్లాలు
- దేవస్థానం ఆధ్వర్యంలో సాధారణ అద్దెలు
- సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు
ఇల వైకుంఠాన్ని తలపించే పంచ నారసింహ యాదగిరిగుట్టలో భక్తులకు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న లక్ష్మీనరసింహస్వామికి మొక్కులు చెల్లించేందుకు కుటుంబ సమేతంగా వచ్చే భక్తజనం ఇబ్బంది పడకుండా కాటేజీలు, సదన్లు, సత్రాలు బస సౌకర్యం కల్పిస్తున్నాయి. రాష్ట్ర నలుమూలలతోపాటు దేశవిదేశాల నుంచి తరలివచ్చే వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేక వసతులు, వనరులను వైటీడీఏ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో తరించే భక్తులకు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల విడిది కోసం కాటేజీలు, సదన్లు, సత్రాలను సకల సౌలత్‌లతో నిర్మించారు. సామాన్యుల నుంచి వీవీఐపీ భక్తులు రెండు, మూడ్రోజులు ఇకడే ఉండి దర్శించుకునేలా వసతులు కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విలాసవంతమైన విల్లాలు..
వీఐపీ, వీవీఐపీ, దేశ విదేశాల నుంచి వచ్చే ముఖ్య అతిథుల కోసం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, దాతల సాయంతో ప్రెసిడెన్సియల్ సూట్లను నిర్మించింది. కొండకు ఈశాన్య ప్రాంతంలో గుట్టపై నిర్మించిన ప్రెసిడెన్సియల్ సూట్‌ను వైటీడీఏ దివ్యసన్నిధి కాటేజీ పేరుతో సామాన్య భక్తులకు కూడా అద్దెకు ఇస్తున్నారు. ఒకో కాటేజీకి రోజుకు రూ.3 వేలుగా నిర్ణయించారు. దీంతోపాటు భక్తులకు ఆలయ సిబ్బందితో ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఇందులో అన్ని అధునాతన సదుపాయాలు కల్పించారు. https://booking.ytda.in/ వెబ్ సైట్లో రూమ్‌లను బుక్ చేసుకునే వీలుంది.
కొండపైన టూరిజం హోటల్..
యాదగిరిగుట్ట కొండపైకి వెళ్లే దారి మధ్యలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న టూరిజం హోటల్ అందుబాటులో ఉంది. స్వామివారి దర్శనానికి దగ్గరలో ఉన్న హోటల్ ఇదొకటే. ఇకడి నుంచి టెంపుల్ చుట్టూ పరిసరాల వ్యూ ఎంతో ఆకట్టుకుంటుంది. రోజుకు వెయ్యి నుంచి రూ.2,300 వరకు అద్దె ఉంది. వారం మధ్యలో, వారాంతాన్ని బట్టి చార్జీల్లో మార్పులు ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్ తోపాటు రెస్టారెంట్ కూడా అందుబాటులో ఉంది. బుకింగ్ కోసం https://tourism. telangana.gov.in/ hotels/Yadagiri guttaHotel అనే వెబ్సైట్లో సంప్రదించవచ్చు.
భక్తులకు సదన్లు..
యాదగిరిగుట్ట కింద దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సదన్లు అందుబాటులో ఉన్నాయి. లక్ష్మీసదన్లో 93 గదులు ఉండగా, వీటిల్లో రోజుకు సాధారణ గదికి రూ.560 అద్దె తీసుకుంటున్నారు. నరసింహ సదన్‌లో 70 గదులు ఉండగా, రోజుకు రూ.340 చెల్లించాల్సి ఉంటుంది. ఇక తులసీ కాటేజీలో కూడా బస చేసే వెసులుబాటు ఉంది. ఇకడ 46 రూమ్‌లు అద్దెకు ఇస్తున్నారు. ఇవి ఇండివిజువల్‌గా ఉంటాయి. ఒకరోజుకు రూ.2,000 పైగా చార్జి చేస్తున్నారు. సౌకర్యాలను బట్టి ఒకో రూమ్ ఒక్కోవిధంగా చార్జి చెల్లించాల్సి ఉంది.
కుల సత్రాల్లోనూ వసతి..
యాదగిరిగుట్ట కింద అనేక కుల సత్రాలు నడుస్తున్నాయి. ఆయా కుల సత్రాల్లో బస చేయవచ్చు. పాత గుట్టకు వెళ్లే దారిలో, రాయగిరి రూట్లో, ఘాట్‌రోడ్డు వైపు పెద్ద ఎత్తున సత్రాలు ఉన్నాయి. ఒకో సత్రంలో ఒకో విధంగా అద్దె వసూలు చేస్తున్నారు. ఇవే కాకుండా ప్రైవేట్ లాడ్జీలు, హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

