‘పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి’
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నట్వ గిరిధర్ కోరారు. శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని...
మాల్, అక్టోబర్ 30 : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నట్వ గిరిధర్ కోరారు. శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిధర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన పట్టభద్రులు తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న అర్హులైన పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. పట్టభద్రుల సౌకర్యార్థం చింతపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగంపల్లి భాస్కర్, కొలుకులపల్లి కొండల్, నల్ల శంకర్, ఎండీ ఫయాజ్, సిద్ధే స్వామి, సల్మాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి’
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

