Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు డిమాండ్ చేశారు.
నల్లగొండ : సింగరేణి లాభాల ( Singareni’s profits ) తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ( Bhaskar Rao ) డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థలో లాభాల తగ్గుదల, బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, రైతుల సమస్యలు, కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీడియా సమావేశంలో నిలదీశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, విద్యుత్ రంగానికి కీలకమైన సింగరేణి సంస్థకు సంబంధించిన ఆర్థిక వివరాలను ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి లాభాలు తగ్గడానికి గల కారణాలను వివరిస్తూ పూర్తి ఆర్థిక నివేదిక, ఆడిట్ వివరాలను విడుదల చేయాలని కోరారు. పన్నులకు ముందు లాభం (PBT), పన్నుల అనంతర లాభం (PAT), ప్రొవిజన్లు, ఇతర కేటాయింపుల వివరాలను వెల్లడించాలని, కార్మికులకు లాభాల వాటా పెంపుపై పునఃపరిశీలన జరపాలని కోరారు. సోలార్ ప్లాంట్లు, డీజిల్, డిటోనేటర్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి వాటాల విక్రయం, ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఏమైనా ఉంటే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, సంస్థ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని పేర్కొన్నారు.రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఎంత మేరకు ఉపయోగపడుతోంది, ఉత్పత్తి తగ్గుదల వల్ల విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతోంది అనే వివరాలను గణాంకాలతో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎం.డి. యూసుఫ్, జొన్నలగడ్డ రంగారెడ్డి, ఎండి.ఇలియాస్ ఖాన్, ధనావత్ బాలాజీ నాయక్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

