నకిలీ పత్తి విత్తనాలు సీజ్
జిల్లాలో నకిలీ విత్తనాల నివారణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ బృందం, వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయంగా పని చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
- 74 కేజీల నకిలీ పత్తి గింజలు.. 300 లీటర్ల నిషేధిత గడ్డి మందు స్వాధీనం
- సూర్యాపేట జిల్లాలో ముగ్గురు అరెస్ట్.. నలుగురు పరారీ
సూర్యాపేట సిటీ, జూన్ 5 : జిల్లాలో నకిలీ విత్తనాల నివారణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ బృందం, వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయంగా పని చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండుచోట్ల నకిలీ విత్తనాల కేసుల్లో ముగ్గురు నిందితులను పట్టుకోగా నలుగురు పరారీలో ఉన్నట్లు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తిరుమలగిరి మండల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నిందితున్ని, ప్రభుత్వ నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో నిందితున్ని తిరుమలగిరి పోలీసులు మంగళవారం అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. సుమారు రూ.1.25 లక్షల విలువైన 52 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, రూ.3.50 లక్షల విలువైన 300 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తిరుమలగిరి మండలం ఈదులపర్రెతండాకు చెందిన సంకేపల్లి సోమిరెడ్డి, గుగులోతు ప్రేమ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలో భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిన్నారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన నాగమల్లేశ్వర్రావు నుంచి తిరుమలగిరికి చెందిన అనంతరెడ్డి నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి నిందితులు సోమిరెడ్డి, ప్రేమ్‌కు అమ్మగా.. వారు వాటిని రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలకు గ్లయోస్పేట్ గడ్డి మందును తట్టుకొనే శక్తి ఉందని, దిగుబడి బాగా వస్తుందని, ఎక్కువసార్లు కలుపు తీయాల్సిన పని లేదని, స్థానిక డీలర్ల వద్ద ఈ విత్తనాలు దొరకవని రైతులను నమ్మించి మోసగిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిందితుల ఇండ్లల్లో దాడులు చేశారు.
దాడుల్లో నకిలీ పత్తి విత్తనాలతోపాటు నిషేధిత 300 లీటర్ల గడ్డి మందును స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అర్వపల్లి మండలం కోటూరుకు చెందిన పేర్ల వెంకన్న తన అన్న పేర్ల బుచ్చయ్యతో కలసి అదే గ్రామానికి చెందిన కంకరబోయిన ప్రసాద్ వద్ద 15 రోజుల క్రితం నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి రైతులకు విక్రయించేందుకు నిందితుడు పేర్ల వెంకన్న తన ఇంటి వద్ద సిద్ధంగా ఉండగా పోలీసులు దాడి చేసి రూ.66 వేల విలువైన 22 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. అన్నదాతలను నమ్మించి నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించినా, సరఫరా చేసినా 8712586026 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

