భారత జాతీయ డిజిటల్ లైబ్రరీలో విలువైన సమాచారం
భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ ఎన్నో భాషల్లోని విలువైన విజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారాంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకు అవసరమైన విలువైన విజ్ఞాన సంపదను ఇందులో నిక్షిప్తం చేశారు
- 70 భాషల్లో లక్షలాదిగా ఈ-బుక్స్
- వేలాదిగా ఆడియో, వీడియో పాఠాలు
- ఉచితంగా అందరికీ అందుబాటులో..
- పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉపయోగం
- ఆసక్తి చూపుతున్న యువత
నేరేడుచర్ల, జనవరి 3 : భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ ఎన్నో భాషల్లోని విలువైన విజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారాంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకు అవసరమైన విలువైన విజ్ఞాన సంపదను ఇందులో నిక్షిప్తం చేశారు. లక్షలాదిగా ఈ-బుక్స్, ఆడియో పాఠాలు, వేలాదిగా వీడియో పాఠాలు అందిస్తున్న ఈ డిజిటల్ లైబ్రరీ వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన వివరాలు మీకోసం..
70 భాషల్లో సమాచారం
జాతీయ డిజిటల్ లైబ్రరీ ద్వారా ఒక్క క్లిక్‌తో విలువైన విద్యా సంబంధిత సమాచారం ఎప్పుడైనా ఎక్కడైనా చాలా సులువుగా పొందవచ్చు. ఇందులో 70 భాషల్లో 60కి పైగా అంశాలపై 15 లక్షల ఈ-బుక్స్, వేలాది వీడియో పాఠాలు, 10వేలకు పైగా ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన డిజిటల్ తరగతులు, 2 లక్షల ఆడియో పాఠాలు, టెక్నాలజీ, సైన్స్, వ్యవసాయం, విలువలతో కూడిన విద్య వంటి ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. టెక్నికల్ రిపోర్ట్స్, మోనోగ్రాఫ్, టెక్నికల్ మాన్యువల్, అల్బమ్స్, న్యాయస్థానాల తీర్పులు వంటి పలు డాక్యుమెంట్లు, వీడియోలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పలు భారతీయ భాషల్లో టెక్నాలజీ, విజ్ఞాన శాస్త్రం, గణితం, ఆర్ట్స్ గ్రూప్‌లకు సంబంధించిన పాఠ్యాంశాలు, సైకాలజీ, తత్వశాస్త్రం, సోషల్ సైన్సెస్, రిలీజియన్, చరిత్ర, భూగోళ శాస్ర్తాలకు సంబంధించిన వేలాది పుస్తకాలు, రికార్డ్స్, వీడియోలు, ప్రాక్టికల్స్ ఈ లైబ్రరీ ద్వారా పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ ఇలా..
భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ సేవలు పొందాలంటే https/ndl.iitkgp.ac.in వెబ్సైట్లో ముందుగా రిజస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఈ-మెయిల్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ కాలం క్లిక్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ చేసుకునేందుకు మీ ఈ-మెయిల్ ఇన్‌బాక్స్‌కి ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు. ఆ తర్వాత మీరు జాతీయ డిజిటల్ లైబ్రరీ సేవలు ఉచితంగా పొందవచ్చు.
ఆంగ్లం నేర్చుకునేందుకు..
ఆంగ్ల భాషకు సంబంధించిన సంప్రదాయ పద్ధతులు, స్పీకింగ్, లెర్నింగ్, ఉచ్ఛారణ నేర్చుకునేందుకు ఆడియో, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. భారత విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ఈ స్టడీ మెటీరియల్ బాగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు రాసే జీఆర్‌ఏ, టోఫెల్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఈ లైబ్రరీలోని ఈ-బుక్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.
ఎన్సీఆర్టీ పుస్తకాలు..
జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఆర్టీ) రూపొందించిన ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రచురితమైన ప్రతి పుస్తకం ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ- గ్రంథ్ నుంచి 50వేలకు పైగా వ్యవసాయ సంబంధిత ఈ-బుక్స్, ఆర్టికల్స్, శాస్త్రవేత్తల కథనాలు ఈ
లైబ్రరీలో పొందవచ్చు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

