సివిల్స్‌లో సత్తాచాటిన నీలగిరి ఆణిముత్యం హిమవంశీ
సివిల్స్ సాధించాలనే తపనతోపాటు ప్రణాళికతో చదివితే విజయం సాధించడం సులభమని నిరూపించాడు నల్లగొండ ఆణిముత్యం దామోర హిమవంశీ. మంగళవారం వెలువడిన సివిల్స్-2022 ఫలితాల్లో సత్తాచాటి జిల్లా కీర్తిని పెంచారు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన సులభంగా చేరుకోవచ్చని నిరూపించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తండ్రి డాక్టర్ కావడంతో తాను సివిల్స్ వైపు వెళ్తే బాగుంటుందని బాల్యంలో నిర్ణయించుకున్న కలను నెరవేర్చుకునేందుకు ఐఐటీ రూర్కీ వేదికైంది.
- ప్రాథమిక విద్యాభ్యాసమంతా నల్లగొండలోనే
- ఐఐటీ రూర్కీలో ఇంటిగ్రేటెడ్ జియోఫిజికల్ టెక్నాలజీ పూర్తి
- ఐఐటీ చదువుతూనే సివిల్స్‌కు సిద్ధం
- నాలుగో పర్యాయంలో 548 ర్యాంక్‌తో విజయసాధన
- తల్లిదండ్రుల ప్రోతాత్సహంతోనే విజయం సాధించానన్న హిమవంశీ
రామగిరి, మే 23 : సివిల్స్ సాధించాలనే తపనతోపాటు ప్రణాళికతో చదివితే విజయం సాధించడం సులభమని నిరూపించాడు నల్లగొండ ఆణిముత్యం దామోర హిమవంశీ. మంగళవారం వెలువడిన సివిల్స్-2022 ఫలితాల్లో సత్తాచాటి జిల్లా కీర్తిని పెంచారు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన సులభంగా చేరుకోవచ్చని నిరూపించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తండ్రి డాక్టర్ కావడంతో తాను సివిల్స్ వైపు వెళ్తే బాగుంటుందని బాల్యంలో నిర్ణయించుకున్న కలను నెరవేర్చుకునేందుకు ఐఐటీ రూర్కీ వేదికైంది. సీనియర్స్ సివిల్స్‌కు సిద్ధమవుతుండటంతో తాను సైతం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ చదువుతూ పూర్తికాగానే తొలి పర్యాయం 2019లో సివిల్స్ రాసి విఫలమయ్యాడు. వెనుకంజ వేయకుండా ఇంట్లోనే ఉంటూ సొంత నోట్స్ తయారుచేసుకుంటూ చదివి నాలుగో పర్యాయం 2022లో సివిల్స్ రాసి 548వ ర్యాంక్‌తో విజయం సాధించాడు. తన విజయ సాధనపై ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంతటి విజయాన్ని కైవసం చేసుకున్నట్లు తెలిపాడు.
హిమవంశీ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం
నల్లగొండ జిల్లా కేంద్ర వైద్యశాలలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ దామెర యాదయ్య- నిర్మల కుమారుడు హిమవంశీ. తన బాల్య విద్యాభ్యాసం నల్లగొండలోని సెయింట్ ఆల్ఫాన్సెస్ హైస్కూల్లో 1నుంచి 10వ తరగతి వరకు చదివాడు. హైదరాబాద్‌లో నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి జేఈఈలో ఉత్తమ పర్సంటైల్‌తో సత్తా చాటాడు. 2013లో ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఐఐటీలో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ జియోఫిజికల్ టెక్నాలజీలో సీటు సాధించాడు.
నాలుగో పర్యాయం విజయం..
2018 బీటెక్ కమ్ ఎంటెక్ పూర్తికాగానే తొలి పర్యాయం 2019లో యూపీఎస్సీ పరీక్ష రాసి విఫలమయ్యాడు. అయినప్పటికీ కచ్చితంగా సాధించాలనే తపనతో సీనియర్స్ సలహాలు సూచనలు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నల్లగొండలోని తన నివాసంలో ఉంటూనే సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదివి 2020, 2021లో మళ్లీ పరీక్ష రాశారు. అయినా రాకపోవడంతో తిరిగి సివిల్స్-2022 రాసి నాలుగో పర్యాయం పరీక్ష రాసి 548 ర్యాంక్ సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు.
పట్టుదలతో సాధించా : హిమవంశీ
నాన్న పిల్లల వైద్యులు. అమ్మ నిర్మల గృహిణి. నాన్న డాక్టర్ కావడంతో చిన్నప్పుడే నువ్వు కలెక్టర్ అయితే బాగుంటుందని చెప్పారు. ఇంట్లో అప్పుడప్పుడు అమ్మానాన్నలు గుర్తు చేస్తూనే ఉండేవారు. అలా నాలో సంకల్పం బలమైన బీజంగా నాటుకుంది. ఇంటర్మీడియెట్ తర్వాత ఐఐటీ రూర్కీలో చేరాగానే సీనియర్స్ సివిల్స్ చదువడం చూశా. ఇక్కడే మరింత చదువాలని నిర్ణయించుకొని అమ్మానాన్నకు చెప్పా. వారు నువ్వు బాగా చదువుకోమని చెప్పారు. అదే స్ఫూర్తితో ఓవైపు ఇంజినీరింగ్ చదవుతోపాటు మరో వైపు సివిల్స్ విజయం సాధించాలంటే ఎలా అనే విషయాలను సీనియర్స్ ద్వారా తెలుసుకున్నా. 2018లో ఇంజినీరింగ్ పూర్తికాగానే తొలి పర్యాయం 2019లో సివిల్స్‌కు ప్రిపేర్ అయినప్పటికీ రాలేదు. కానీ, మా అమ్మానాన్న నీలో సత్తా ఉంది చదువాలని ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో నల్లగొండలో ఇంట్లోనే ఉంటూ సొంత నోట్స్ తయారుచేసుకుంటూ సిద్ధమై 2020, 2021, 2022లో రాసి దేశంలో 548 ర్యాంక్‌తో విజయం సాధించా. కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందనే ఆలోచన ఉండకూడదు. అదే నేను చేశాను. రోజుకు 8 నుంచి 9గంటలు మాత్రమే చదివేవాడిని. తర్వాత అమ్మానాన్నతో సంతోషంగా గడిపేవాడిని. ఆత్మ విశ్వాసంతో చదివితే సివిల్స్‌లో సత్తా చాటడం సులభం.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

