‘పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తే 25 కిలోల బియ్యం, రైస్ కుక్కర్’
ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనే సంకల్పంతో సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే కుటుంబాలకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి..
– 5వ తరగతి పూర్తైతే సైకిల్
– ఇంటి పన్ను చెల్లించే బాధ్యత గ్రామ పంచాయతీదే
– నాగులపహాడ్ సర్పంచ్ నిరంజన్ రెడ్డి ప్రోత్సాహకాల ప్రకటన
పెన్‌పహాడ్, జూలై 10 : ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనే సంకల్పంతో సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే కుటుంబాలకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి ముందుకొచ్చారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రేషన్‌కు అదనంగా నెలకు 25 కిలోల బియ్యం, ఒక రైస్ కుక్కర్, విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగ్‌లు, నోట్‌బుక్స్, ఇతర విద్యా సామగ్రి అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా అదే పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసే ప్రతి విద్యార్థికి నూతన సైకిల్ బహుమతిగా అందిస్తామని ప్రకటించారు.
ఇటీవల అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాఠశాల మూసివేత ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ బడిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం ఉంచి తమ పిల్లలను ఈ విద్యా సంవత్సరంలో తప్పకుండా చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ రాయి రమేశ్, వార్డు సభ్యులు కొండ గోవర్ధన్, మామిడి జానమ్మ, కందుకూరి నరేశ్, గోలి చిన లింగయ్య, మీసాల జ్యోతి, ఒగ్గు రేణుక, కందుకూరి బక్కమ్మతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొని ఈ వినూత్న కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

