బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 11, 2020 , 00:19:31

మన్యంకొండల్లో జనఝరి

మన్యంకొండల్లో జనఝరి

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవం క న్నుల పండువగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆల యం, ఆలయ ప్రాంగణాలు విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా దర్శనమిచ్చాయి. ముందుగా స్వామి ఉత్సవ విగ్రహాన్ని కొండపై నుంచి కొండ దిగువకు పల్లకీలో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్వామి వారి పల్లకీని మోశారు. అనంతరం స్వామి విగ్రహాన్ని రథంలో ఉంచి వే డుకను కొనసాగించారు. రథాన్ని లాగేందుకు భ క్తు లు పోటీ పడ్డారు. మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి రథాన్ని కొద్ది దూరం లాగారు. ఈ సం దర్భంగా మన్యంకొండ గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. వేడుకను తిలకించేందుకు భ క్తులు ఆదివారం ఉద యం నుంచే భారీగా తర లివచ్చారు. దాదాపు లక్షా 50 వేల మంది భక్తజనం హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భ క్తులు హాజరయ్యా రు. స్వామికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. గంటల తరబడి క్యూలైన్లు నిల్చొని వెంకన్నను దర్శనం చేసుకొని తరించారు. చాలా మంది భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆదివారం రాత్రికి అక్కడే బస చేశారు. భక్తులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

రాష్ట్రంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. రథోత్సవానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు తీరితే తిరుపతి, తీరకపోతే మన్యంకొండకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఇక్కద స్వామి దర్శనంతో తిరుపతి వెళినంత మోక్షం కలుగుతుందని భ క్తులు విశ్వసిస్తారని ఆయనన్నారు. వచ్చే ఏడాదికి ప్ర జల కోరికలు తీర్చి మరింత ఉత్సాహంగా బ్రహ్మోత్సవాలకు జరిగేలా చూడాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌ డ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు అల్లావుద్దీన్‌,  ఎంపీపీ సుధాశ్రీ, దేవాలయ ధర్మకర్త అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈవో వెంకటాచారి, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌ యాదవ్‌,  మల్లు నర్సింహారెడ్డి, సర్పంచులు శ్రీకాంత్‌గౌడ్‌, చంద్రకళ వెంకటస్వామి, రమ్య దేవేందర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, కుర్వ శ్రీను, ఊశన్న,  రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


logo