శనివారం 30 మే 2020
Nagarkurnool - Jan 22, 2020 , 05:11:56

ఎన్నికల పరిశీలన

ఎన్నికల  పరిశీలన


కల్వకుర్తి, నమస్తే తెలంగాణ :  మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఉమ్మడి జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకురాలు పౌసమి బసు పరిశీలించారు. కల్వకుర్తి ఎస్ బీఈడీ కళాశాలలో పోలింగ్ డిస్ట్ట్రిబ్యూషన్ కేంద్రంతో పాటు పోలింగ్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు. పోలింగ్ బాక్సుల పంపిణీ కార్యక్రమంతో పాటు స్ట్రాంగ్ రూంలను ఎన్నికల పరిశీలకులు పౌసమి  పరిశీలించారు. అనంతరం కల్వకుర్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న జాగ్రత్తలను పౌసమి బసు అధికారులను అడిగారు. తగిన  సూచనలు, సలహాలు ఇచ్చారు, కార్యక్రమంలో  ఆర్టీవో రాజేశ్  గిరాబాబు, కమిషనర్ బాలచందర్ సృజన్, తాసిల్దార్ రాంరెడ్డి తదితరులు ఉన్నారు.



logo